షాద్ నగర్ లో కాల్పుల కలకలం: నయీమ్ హతo
- August 08, 2016
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ మిలీనియం టౌన్ షిప్ లో కాల్పుల కలకలం రేగింది. గ్రేహౌండ్స్ పోలీసుల కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమయ్యాడు. నయీమ్ నక్కిన ఇంటిని ఈ తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. అతడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నయీమ్ హతమయ్యాడు.మాజీ మావోయిస్టులు సాంబశివుడు, రాములు, పటోళ్ల గోవర్థన్ రెడ్డి, ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో నయీమ్ నిందితుడు. నల్లగొండ జిల్లా భువనగిరి నయీమ్ స్వస్థలం. గత కొంతకాలంగా అతడు షాద్ నగర్ లో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. అతడిపై 100పైగా కేసులున్నాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







