ఎన్నారైలు యూఏఈ నుండి డ్యూటీ ఫ్రీలో బంగారు నాణేలు తీసుకువెళ్లవచ్చా?
- May 19, 2026
యూఏఈ: యూఏఈ నుండి వచ్చే పర్యాటకులు మరియు భారతీయ నివాసితులు బంగారు నాణేలు, బార్ లను తీసుకువెళ్లడానికి అనుమతి ఉంది. కానీ భారతీయ నిబంధనల ప్రకారం దీనికి డిక్లరేషన్ మరియు కస్టమ్స్ డ్యూటీ తప్పనిసరి అని దుబాయ్‌లోని బంగారు ఆభరణాల వ్యాపారులు తెలిపారు.
భారత్ బంగారం దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుండి 15 శాతానికి పెంచింది. దీంతో యూఏఈ మరియు భారత్ మధ్య ధరలలో మరింత వ్యత్యాసం ఏర్పడటంతో దుబాయ్‌లో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరిగిందని కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ తెలిపారు.
ఎన్ఆర్ఐలు మరియు భారతీయ పౌరులు బంగారు నాణేలు మరియు బార్ లను తీసుకురావడానికి అనుమతి ఉందని, అయితే అవి డ్యూటీ-ఫ్రీ జ్యువెలరీ అలవెన్స్ కిందకు రావని మరియు వాటిని భారతీయ కస్టమ్స్ వద్ద తప్పనిసరిగా డిక్లేర్ చేయాలని కంజ్ జ్యువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ ధనక్ స్పష్టం చేశారు.
ఇక దుబాయ్‌లో 24K బంగారం ధర గ్రాముకు Dh547.25గా ఉండగా, భారత్ లో రూ.15,600 (Dh595)గా ఉంది.
తాజా భారత కస్టమ్స్ బ్యాగేజ్ నిబంధనలు 2026 ప్రకారం, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విదేశాలలో నివసించిన మేల్ ప్రయాణికులు రూ.50,000 (Dh1,908) విలువ పరిమితితో 20 గ్రాముల వరకు, మహిళా ప్రయాణికులు రూ.100,000 (Dh3,815) విలువ పరిమితితో 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను డ్యూటీ ఫీ లేకుండా తీసుకురావచ్చు. దీనికి మించిన పరిమాణంపై సవరించిన దిగుమతి డ్యూటీ ఫీ విధానం ప్రకారం కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2026 మొదటి త్రైమాసికపు డేటా ప్రకారం, యూఏఈలో బంగారు నాణేలు మరియు భార్ లకు డిమాండ్ పెరిగింది. గత ఏడాది 3.1 టన్నులు ఉండగా, ఈ ఏడాది 27 శాతం పెరిగి 4.0 టన్నులకు చేరింది.
అదే సమయంలో భారత్ లో బంగారు ఆభరణాల డిమాండ్ 2025 మొదటి త్రైమాసికంలో 81.6 టన్నులు ఉండగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో19 శాతం తగ్గి 66.1 టన్నులకు చేరింది. ఆభరణాలతో పోలిస్తే భార్ లు లేదా నాణేలకు తక్కువ ప్రీమియంలు ఉండటం వల్ల, ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే చాలా మంది కొనుగోలుదారులు వాటి వైపు మళ్లి ఉండవచ్చని కౌన్సిల్ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







