ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- May 21, 2026
మస్కట్: ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా ప్రైవేట్ రంగ సంస్థలకు కార్మిక శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మే నెల జీతాలను 2026 మే 25వ తేదీకి ముందుగానే ఉద్యోగులకు చెల్లించాలని అన్ని ప్రైవేట్ సంస్థలను ఆదేశించింది.
1447 హిజ్రీ సంవత్సరానికి సంబంధించిన ఈద్ అల్ అధా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది. రాయల్ డిక్రీ నెం. (53/2023) ప్రకారం అమల్లో ఉన్న కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
ఉద్యోగులు పండుగను సంతోషంగా జరుపుకునేందుకు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తుగా జీతాలు చెల్లించడం అవసరమని అధికారులు తెలిపారు.
జీతాల చెల్లింపులో ఆలస్యం జరిగితే సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కార్మిక శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







