షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- May 21, 2026
షార్జా: ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా షార్జా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ 227 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.
మంచి ప్రవర్తన, క్రమశిక్షణ ప్రమాణాలను పూర్తి చేసిన ఖైదీలను షార్జాలోని శిక్షా, సవరణ సంస్థ నుంచి విడుదల చేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
పండుగ సందర్భంలో ఖైదీలకు కొత్త జీవితానికి అవకాశం కల్పించడం, వారి కుటుంబాల్లో ఆనందాన్ని తీసుకురావడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
యూఏఈలో ప్రధాన మతపరమైన పర్వదినాల సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించడం సంప్రదాయంగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







