బహ్రెయిన్‌లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- July 13, 2026
మనామా: బహ్రెయిన్‌లో సోమవారం తెల్లవారుజామున అత్యవసర సైరన్లను మోగించినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పౌరులు, నివాసితులంతా ప్రశాంతంగా ఉండి సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెంటనే వెళ్లాలని సూచించింది.
ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది. "సైరన్ మోగించబడింది. పౌరులు, నివాసితులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండి, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి" అని ఆ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు అధికారిక వర్గాలు జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
అయితే, సైరన్లు మోగించడానికి గల కారణంపై అధికారులు వెంటనే ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







