IPL ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
- May 21, 2026
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం జరగనున్న IPL క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో నగరవాసులకు ఎల్అండ్టీ మెట్రో రైలు సంస్థ, తీపి కబురు అందించింది. స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి అభిమానులు ఎటువంటి రవాణా ఇబ్బందులు పడకుండా ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా మెట్రో రైలు సేవలను అర్ధరాత్రి 12:00 గంటల వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణ రోజుల్లో మెట్రో రైళ్లు రాత్రి 11:00 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. అయితే శుక్రవారం మ్యాచ్ ముగిసే సమయానికి రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి, ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు సర్వీసులను నడపనున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియానికి సమీపంలో ఉండే ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ, మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు రైలు ఎక్కవచ్చు. ఇక్కడి నుంచి మెట్రో నెట్‌వర్క్‌లోని అన్ని కారిడార్లలో ఉన్న ఏ స్టేషన్‌కైనా వెళ్లేందుకు ప్రయాణ సదుపాయం కల్పించారు.
స్టేడియం నుంచి బయటకు వచ్చే జనం రద్దీని మరియు ప్రయాణికుల అవసరాలను బట్టి ఉప్పల్ నుంచి నాగోల్, అమీర్‌పేట, మియాపూర్, జేబీఎస్ రూట్లలో ప్రత్యేకంగా అదనపు రైళ్లను నడపనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. మ్యాచ్‌కు వెళ్లే వారు ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ తలనొప్పులు లేకుండా ఉండేందుకు సొంత వాహనాలకు బదులు మెట్రో సేవలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సైతం సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







