కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు

- May 24, 2026 , by Maagulf
కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు

దుబాయ్: కత్తులు వంటి పదునైన ఆయుధాలతో హింసాత్మక ఘర్షణకు పాల్పడిన యువకుల గుంపునుదుబాయ్ పోలీస్ అరెస్ట్ చేసింది. ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి నిందితులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుని, సంబంధిత అధికారుల ముందుకు హాజరుపరిచినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లనీయబోమని అధికారులు స్పష్టం చేశారు.

సమాజంలో జరిగే అనుమానాస్పద లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఇందుకోసం దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్న “పోలీస్ ఐ” సేవను వినియోగించాలని లేదా 999 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

“పోలీస్ ఐ” సేవ ద్వారా నివాసితులు పూర్తి గోప్యతతో అనుమానాస్పద ఘటనలు, గొడవలు, అసాంఘిక ప్రవర్తన, మద్యం లేదా డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలు వంటి అంశాలను ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు సమయంలో ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు జతచేయడంతో పాటు ఘటన స్థలాన్ని కూడా గుర్తించవచ్చు.

చట్టవ్యతిరేక ఘటనలను అధికారిక మార్గాల ద్వారానే పోలీసులకు తెలియజేయాలని, ప్రజలు స్వయంగా చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం చట్టవిరుద్ధమని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com