ఢిల్లీ వెళ్ళిన 'బాహుబలి'

- July 25, 2015 , by Maagulf
ఢిల్లీ వెళ్ళిన 'బాహుబలి'

 బాహుబలి చిత్రం అనుకున్నదాని కంటే మరింత విజయం సాధించడంతో.. సినిమా హీరో ప్రభాస్ ఢిల్లీ వెళ్లాడు. అక్కడ తన పెదనాన్న, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజుతో కలిసి పలువురు ప్రముఖుల వద్దకు వెళ్తున్నాడు. ముందుగా ఆయన శనివారం నాడు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. శాలువాతో రాజ్ నాథ్ ను సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్.. హీరో ప్రభాస్ ను అభినందించారు. బాహుబలిని తెలుగు నుంచి హిందీలోకి కూడా డబ్బింగ్ చేసిన విషయం తెలిసిందే. అది అక్కడ కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. హిందీ వెర్షన్ కు 73 కోట్ల రూపాయలు వచ్చాయి. 7.5 కోట్లు వస్తే చాలని అనుకోగా.. దాదాపు దానికి పది రెట్ల మొత్తం రావడం గమనార్హం.బాహుబలి 2 చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 15న ప్రారంభంకానుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com