‘బెంగళూరు మహానగరంలో బాలక’ ఫస్ట్ లుక్ రిలీజ్

- May 26, 2026 , by Maagulf
‘బెంగళూరు మహానగరంలో బాలక’ ఫస్ట్ లుక్ రిలీజ్

మంత్ర మూవీ మేకర్స్, ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మహి – రాజ్ ద్వయం దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా చిత్రం ‘బెంగళూరు మహానగరంలో బాలక(BMB First Look)’. ఆంధ్ర కుర్రాడు బెంగళూరు మహానగరంలో ఎదుర్కొనే కష్టాలు, సవాళ్ల నేపథ్యంలో ఒక అవుట్ అండ్ అవుట్ వినోదభరితమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాలలో ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ప్రియదర్షి లాంచ్ చేశారు.

ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ టాలీవుడ్‌కు నటుడిగా పరిచయమవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా విజువల్స్ అందిస్తుండగా, విశ్వదీప్ అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. హర్షిత్ కొటా ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సరికొత్త కథాంశంతో, పక్కా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com