రియో ఒలింపిక్స్‌లో మూడో రోజు రికార్డులు బద్దలయ్యాయి...

- August 09, 2016 , by Maagulf
రియో ఒలింపిక్స్‌లో మూడో రోజు రికార్డులు బద్దలయ్యాయి...

రియో ఒలింపిక్స్‌లో మూడో రోజు రికార్డులు బద్దలయ్యాయి. స్విమ్మింగ్‌లో అత్యధికంగా రికార్డులు నమోదయ్యాయి. మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో అమెరికాకు చెందిన 19ఏళ్ల లిల్లాకింగ్‌ 1.04.93 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని ఒలింపిక్‌లో రికార్డు సృష్టించింది.
* పురుషుల 100 మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్‌లో అమెరికాకు చెందిన రియాన్‌ మూర్ఫీ 51.97 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త ఒలింపిక్‌ రికార్డును నమోదు చేశాడు.
* మహిళల 58 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌లో థాయిలాండ్‌కు చెందిన సుకన్యా శ్రీసురత్‌ 240 కిలోల బరువు ఎత్తి ఒలింపిక్‌ రికార్డు నమోదు చేసింది.
* స్విమ్మింగ్‌ మహిళల విభాగంలో 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో హంగేరి క్రీడాకారిణి కత్నికా హోస్జూ 2.07.45 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని సరికొత్త ఒలింపిక్‌ రికార్డును సృష్టించింది.
* పురుషుల 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ అర్హత పోటీల్లో ఇటలీకి చెందిన నిక్కోలో కాంప్రియానీ 630.2 స్కోర్‌ సాధించి ఒలింపిక్‌ రికార్డును నమోదు చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com