హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ...
- August 09, 2016
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో వూరట లభించింది. భూ సేకరణ జీవో 123 రద్దు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత మంగళవారం హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. నిర్వాసితులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారికి ప్రయోజనాలు కల్పిస్తామని, దీనిపై జీవో జారీ చేస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూసేకరణ జీవో 123ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూముల క్రయవిక్రయాలు తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది. జీవో జారీ చేసి తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. మెదక్‌జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణకోసం తెలంగాణ ప్రభుత్వం జీవో 123 జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







