మరోసారి ఢీ కి రెడీ అవుతున్నా శర్వానంద్...
- August 09, 2016
ఇన్నాళ్లు ఒకేసమయంలో రెండు భారీ చిత్రాలను రిలీజ్ చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ఈ ఏడాది సంక్రాంతి నుంచి సీన్ మారిపోయింది. ఒకేసారి రెండు మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదని ప్రూవ్ అయ్యింది. అంతేకాదు సరైన కంటెంట్ ఉంటే అంత కాంపీటీషన్ లో కూడా ఓ చిన్న సినిమా సత్తా చాటగలదని నిరూపించాడు శర్వానంద్. నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయన, డిక్టేటర్ లాంటి భారీ చిత్రాల రిలీజ్ సమయంలో ఎక్స్ ప్రెస్ రాజాగా వచ్చి సక్సెస్ సాధించాడు.
అందుకే మరోసారి అదే సాహసానికి రెడీ అవుతున్నాడు శర్వానంద్. ఇప్పటికే వచ్చే సంక్రాంతికి బాలయ్య, నాగార్జునలు బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. ఈ ఇద్దరు హీరోలు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలతోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. బాలయ్య గౌతమీ పుత్రశాతకర్ణిగా, నాగార్జున ఓం నమో వేంకటేశాయ సినిమాతో పరమ భక్తుడు హాథీరాం బాబాగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.ఈ ఇద్దరు స్టార్ హీరోలతో మరోసారి ఢీ అనేందుకు రెడీ అవుతున్నాడు శర్వానంద్. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానంభవతి సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసి.. మరోసారి సత్తా చాటలని ప్లాన్ చేసుకుంటున్నాడు శర్వానంద్. దిల్ రాజుకు కూడా ఈ సీజన్ లో మంచి రికార్డ్ ఉండటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







