నేడు స్వల్పంగా బంగారం ధర పెరిగింది..
- August 09, 2016
వరసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.70 పెరిగి రూ.30,970కి చేరింది. దేశీయ మార్కెట్లో నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరిగినట్లు బులియన్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 0.28శాతం తగ్గి 1,331.30 డాలర్లకు చేరింది.ఈరోజు మార్కెట్లో వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి రూ.50 పెరిగి రూ.46,300కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి ధర తగ్గింది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.48శాతం తగ్గి 19.58 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







