బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!

- June 04, 2026 , by Maagulf
బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!

యూఏఈ: బిగ్ టికెట్ అబుదాబి జూన్ 3 లైవ్ డ్రాలో కృష్ణకుమార్ శ్యామల రవీంద్రన్ అనే భారతీయ ప్రవాసికి అదృష్టం వరించింది. ఆయన  ఏకంగా 20 మిలియన్ల దిర్హమ్స్ గెలుచుకున్నారు. బహ్రెయిన్‌లో నివసిస్తున్న ఈయన, మే 28న కొనుగోలు చేసిన 339729 నంబర్ టికెట్‌తో ఈ జాక్ పాట్ కొట్టాడు. ఈ  43 ఏళ్ల కేరళ వ్యాపారవేత్త గత 23 ఏళ్లుగా బహ్రెయిన్‌లో నివసిస్తుండగా, అతని కుటుంబం స్వదేశంలోనే ఉంది. అతను గత ఏడేళ్లుగా బిగ్ టికెట్ డ్రాలలో పాల్గొంటున్నారు. కోవిడ్ సమయంలో తాను ఇందులో పాల్గొనడం మొదలుపెట్టినట్లు చెప్పారు. కొన్నిసార్లు స్నేహితులతో కలిసి, మరికొన్నిసార్లు ఒంటరిగా టిక్కెట్లు కొనుగోలు చేసేవాడినన్నారు. కాగా, విజేతగా నిలిపిన టికెట్ ను మాత్రం సొంతంగా కొన్నట్లు పేర్కొన్నారు. తాను యాదృచ్ఛికంగా నంబర్లను ఎంచుకున్నట్లు కృష్ణ తెలిపారు. ప్రైజ్ మనీని ఎలా ఉపయోగించాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.  
గత నెలలో, అబ్దుల్ రషీద్ అల్లిప్రా వలప్పిల్ అబ్దు అనే 48 ఏళ్ల భారతీయ డ్రైవర్, ఒక రాఫిల్ డ్రాలో Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్నారు. ఈ రోజు జరిగిన డ్రా కార్యక్రమానికి ఆయన స్వయంగా హాజరై, విజేత టికెట్‌ను ఎంపిక చేశారు.

ఇతర విజేతలు
'సిరీస్ 287' డ్రాలో, ఐదు కన్సోలేషన్ బహుమతుల విజేతలను ప్రకటించారు. వీరందరూ ఇండియాకు చెందినవారే కావడం గమనార్హం.
మొదటి కన్సోలేషన్ బహుమతి (Dh1 మిలియన్): కిషోరేష్ రౌత్ (దుబాయ్‌ నివాసి) - టికెట్ నంబర్: 307886
రెండవ కన్సోలేషన్ బహుమతి (Dh500,000): జినోయ్ కుమార్ (షార్జా నివాసి) - టికెట్ నంబర్: 241815
మూడవ కన్సోలేషన్ బహుమతి (Dh250,000): శరద్ కుమార్ సింగ్ (దుబాయ్‌ నివాసి) - టికెట్ నంబర్: 289717
నాల్గవ కన్సోలేషన్ బహుమతి (Dh100,000): ప్రభురామ్ యాదవ్ (షార్జా నివాసి) - టికెట్ నంబర్: 383380
ఐదవ కన్సోలేషన్ బహుమతి (Dh100,000): ప్రకాశన్ (సౌదీ అరేబియా నివాసి) - టికెట్ నంబర్: 052606

కొత్త గేమ్
జూన్ నెల లైవ్ షోలో ఒక కీలక ప్రకటన చేశారు. ప్రముఖ 'The Big Win' గేమ్ నేటి ఎడిషన్ చివరిదని నిర్వాహకులు వెల్లడించారు. వచ్చే నెల నుండి, 'The Big Spin' అనే సరికొత్త గేమ్ ప్రారంభం కానుంది. దీని ద్వారా పాల్గొనేవారు, ప్రస్తుతం గరిష్టంగా లభించే Dh150,000 బహుమతి కంటే ఎంతో అధిక మొత్తాన్ని గెలుచుకునే అవకాశాన్ని పొందుతారని చెప్పారు. 'Big Ticket'లో పాల్గొనేవారిలో ముగ్గురికి, జూలై నెలలో జరిగే 'The Big Spin' మొదటి ఎడిషన్‌లో ఆడే అవకాశం లభిస్తుందన్నారు. ఒక వీల్ ను తిప్పడం ద్వారా, ఆ ముగ్గురిలో ఒక్కొక్కరూ Dh1 మిలియన్ వరకు గెలుచుకునే అవకాశాన్ని పొందుతారని పేర్కొన్నారు.

చివరి 'Big Win' గేమ్
'The Big Win' గేమ్  చివరి ఎడిషన్‌లో ఆడేందుకు నలుగురు పాల్గొనేవారిని ఎంపిక చేశారు. వారి కళ్లకు గంతలు కట్టిన తర్వాత, వివిధ నగదు బహుమతులు కలిగిన బంతుల్లోంచి ఒకదానిని ఎంచుకోవడంలో, వారికి తెలిసిన వ్యక్తులు సహాయం చేశారు. బహ్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరుడు లవీ సింగ్, తన స్నేహితుడి సాయంతో Dh150,000 విలువైన బంతిని ఎంచుకున్నారు. తాను గెలుచుకున్న ఈ మొత్తాన్ని తన స్నేహితులతో పంచుకుంటానని ఆయన తెలిపారు. 1968 నుండి అబుదాబిలో నివసిస్తున్న ఒక లెబనీస్ వ్యక్తి కూడా ఇందులో పాల్గొన్నారు. మాజెద్ ఆల్బర్ట్ తన భార్య హలా సహాయంతో Dh150,000 విలువైన బంతిని ఎంచుకోగలిగారు.

ఖతార్‌లో నివసిస్తున్న ఒక భారతీయుడు అయిన అభిలాష్ ఉతుమన్, తాను అబుదాబికి వచ్చి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనలేకపోయినందున, తన తరపున ఆడటానికి తన స్నేహితుడు జితిన్‌ను నామినేట్ చేశారు. జితిన్ తన స్నేహితుడి సాయంతో Dh140,000 విలువైన బంతిని ఎంచుకున్నారు. చివరి పోటీదారు ఎమిరాటి జస్సిమ్ అల్ యాసి, తన కుమారుడు మహమ్మద్ సహాయంతో Dh150,000 గెలుచుకున్నారు.  

'డ్రీమ్ కార్' విజేత
బంగ్లాదేశ్ ప్రవాసి అయిన మహమ్మద్ రాను మియా మియా ఒక 'రేంజ్ రోవర్ వెలార్' కారును గెలుచుకున్నారు. అల్ ఐన్‌లో నివసించే ఈయన, 022391 టిక్కెట్ నంబరుతో ఈ విలాసవంతమైన కారును సొంతం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com