సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!

- June 05, 2026 , by Maagulf
సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!

మనామా: ప్రాంతీయంగా నెలకొన్న తాజా పరిణామాలపై కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తో టెలిఫోన్ కాల్ ద్వారా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి  మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ చర్చించారు.ఈ సందర్భంగా బహ్రెయిన్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను సౌదీ అరేబియా ఖండిస్తుందని మహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు. తన భద్రతను కాపాడుకోవడానికి బహ్రెయిన్ తీసుకుంటున్న చర్యలకు సౌదీ అరేబియా పూర్తి మద్దతు మరియు సంఘీభావం అందిస్తుందని తెలియజేశారు. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక మరియు వ్యూహాత్మక సంబంధాలను ఈసందర్భంగా ఇరువురు నేతలు గుర్తుచేసుకున్నారని అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com