సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!

- June 05, 2026 , by Maagulf
సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!

లండన్: సౌదీ విద్యార్థి మహమ్మద్ అల్-ఖస్సిం హత్య కేసులో ప్రధాన నిందితుడైన చాజ్ కొరిగాన్‌కు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జ్ క్రౌన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.  ఈ హత్య సమయంలో నిందితుడు మాదకద్రవ్యాలు, మద్యం మత్తులో ఉన్నాడని నిర్ధారించారు. పెరోల్‌కు అర్హత సాధించడానికి కనీసం 22 సంవత్సరాల ఆరు నెలల పాటు జైలులో ఉండాలని న్యాయమూర్తి ఆదేశించారు.

2025 ఆగస్టులో కేంబ్రిడ్జ్‌లోని విద్యార్థుల హాస్టల్ వెలుపల అల్-ఖస్సిమ్‌ను మెడపై కత్తితో పొడిచి చంపారు. కేంబ్రిడ్జ్‌లోని హోల్‌బ్రూక్ రోడ్‌కు చెందిన నిర్మాణ కార్మికుడు చాజ్ కొరిగన్, డ్రగ్స్ మత్తులో వంటగది కత్తితో అల్-ఖస్సిమ్‌పై దాడి చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అలాగే, నేరస్థుడికి సహాయం చేసిన కొరిగన్ తండ్రి, 50 ఏళ్ల పీటర్ కొరిగన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. దాడి సమయంలో తన కుమారుడు ధరించిన డ్రెస్ ను అతను దాచిపెట్టాడని కోర్టు తెలిపింది. ఈ విచారణ సమయంలో అల్-ఖస్సిమ్ తండ్రి యూసెఫ్ అల్-ఖస్సిమ్ మరియు సోదరి షాతా అల్-ఖస్సిమ్‌ లు కోర్టులోనే ఉన్నారు.

యునైటెడ్ కింగ్‌డమ్ మరియు సౌదీ అరేబియా లో హై అలెర్ట్ క్రియేట్ చేసిన ఈ హత్య కేసుకు సంబంధించి నెలల తరబడి దర్యాప్తులు మరియు విచారణలు జరిగాయి. చివరకు నింతితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో కేసుకు ముగింపు పడింది. సౌదీ అరేబియాలోని మక్కాకు చెందిన 20 ఏళ్ల అల్-ఖస్సిం, కేంబ్రిడ్జ్‌లో 10 వారాల స్టడీ అసైన్‌మెంట్‌పై ఉన్న సమయంలో హత్యకు గురయ్యాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com