రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- June 05, 2026
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
సింగీతం శ్రీనివాసరావు తో సినిమా అనగానే మీ ఫీలింగ్ ఏంటి?
-నేను సింగీతం కి వీరాభిమానిని. ఆయన లెజెండ్. నాన్నని కలవడానికి వచ్చేటప్పుడు వాళ్లు మాట్లాడుకుంటుంటే నేను ఆరాధనగా చూసేవాడిని.చాలా ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో జీసస్ పై ఒక సినిమా అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ సమయంలో సింగీతం మా స్టూడియోకు వచ్చి ‘సింగ్ గీతం’ ఐడియా చెప్పారు. అది వినగానే నాకు చాలా థ్రిల్‌గా అనిపించింది. ఎప్పుడైనా ఆ సినిమా చేయాలని అనిపించింది.
-సింగీతం చేసిన ప్రయోగాలు మరెవ్వరూ చేసి ఉండరు. పుష్పక విమానం, భైరవద్వీపం, ఆదిత్య 369 వంటి చిత్రాలు నాకు చాలా ఇష్టం. మూడేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని ఆయన నుంచి ఫోన్ వచ్చింది.అప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత ఏడాది క్రితం నాగ్ అశ్విన్, స్వప్న, వైజయంతి మూవీస్‌తో కలిసి ఈ సినిమా రూపొందుతుండటం మరింత ఆనందాన్ని ఇచ్చింది.
-ఈ సినిమాను నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సింగీతం గారికి ఒక ట్రిబ్యూట్‌లా, ఆయనతో కలిసి పనిచేయడం ఒక బ్లెస్సింగ్‌లా అనిపించింది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.
సింగీతం గారు చాలా ఏళ్ల క్రితమే ఈ కథ అనుకున్నారు కదా...ఇప్పటికీ ఈ కథ ఎంత రిలెవెంట్‌గా ఉంటుంది?
-సింగీతం ఎప్పుడూ ట్రెండ్‌కి తగ్గట్టు కథలు ఆలోచించలేదు. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే అది ఇంతకుముందు రానిది, తర్వాత కూడా రానిదిగా ఉంటుంది. ఆయన చేసిన సినిమాలన్నీ గమనిస్తే అలాంటివే. పుష్పక విమానం ఇప్పటికీ చాలా అడ్వాన్స్‌డ్ సినిమా.
-‘సింగ్ గీతం’ ఐడియా కూడా అంతే కొత్తగా ఉంటుంది. కళ, సంగీతానికి సంబంధించిన అంశాలు ఎప్పటికీ పాతబడవు. ఉదాహరణకు విశ్వనాథ్ సాగర సంగమం ఎప్పటికీ పాతబడదు. 50 ఏళ్ల తర్వాత చూసినా కొత్తగానే అనిపిస్తుంది.
- ఒక గ్రామం మొత్తం మాట్లాడలేక, కేవలం పాటల రూపంలోనే సంభాషించే కథ ఇప్పటి వరకు రాలేదు.
-ఇది కేవలం కామెడీ సినిమా కాదు. ఇందులో అద్భుతమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. సింగీతం గారికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
-నాగ్ అశ్విన్ కి సింగీతం గారంటే అమితమైన ప్రేమ. స్వప్న కి కూడా ఆయనంటే ఎంతో ఇష్టం. అందరం ప్రాణం పెట్టి పనిచేశాం.
మాటలన్నీ పాటలుగా చేశారు కదా...ఆ అనుభవం గురించి చెప్పండి?
-నిజంగా ఇది నా కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ సినిమా.నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ మొత్తం చదివి ప్రతి డైలాగ్‌ను సంగీతంగా మార్చాల్సి వచ్చింది.
-ఇలాంటి సినిమాలకు భాష పై మంచి పట్టు ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి మైకేల్ జాక్సన్, ఇళయరాజా గారి లాంటి సంగీతం చేయాలనే కోరిక ఉండేది. ట్యూన్స్ కట్టడం వచ్చేది. కానీ లిరిక్స్ ఉండేవి కావు. అప్పుడు న్యూస్‌పేపర్ తీసుకుని అందులో ఉన్న వార్తలనే ట్యూన్స్‌గా మార్చుకునేవాడిని. మా నాన్నగారు చూసి నవ్వేవారు.
-చిన్నప్పటి నుంచి ప్రతి అక్షరాన్ని సంగీతంగా మార్చే అలవాటు నాకు ఉండేది. తెలిసో తెలియకో అదే ఈ సినిమాకు ఉపయోగపడింది. ఒక సీన్ తీసుకుని మ్యూజికల్‌గా చేసి వినిపించాను.అది విని సింగీతం చాలా సంతోషించారు. "మనకు కావాల్సిన మ్యూజిక్ ఇదే" అన్నారు. అది నాకు పెద్ద కాంప్లిమెంట్‌గా అనిపించింది.
-ఈ సినిమా కోసం ప్రతిదీ ముందుగానే మ్యూజికల్‌గా చేసి ఇచ్చాం. తర్వాత దానిని షూట్ చేశారు.
-మిగతా సినిమాలకు ఒక ఫార్మాట్ ఉంటుంది. కానీ ఈ సినిమాకు అలాంటి ఫార్మాట్ లేదు. నేనే కొత్త ఫార్మాట్ కనిపెట్టుకోవాల్సి వచ్చింది.మ్యూజిక్‌ను పార్ట్స్‌గా విభజించి పంపించేవాడిని. సింగీతం, నాగ్ అశ్విన్ సూచనలు ఇస్తే ఆ పార్ట్స్ ఆధారంగా మార్పులు చేసేవాళ్లం.
-జనరల్ గా సినిమాలో డైలాగ్ మారినా ఎడిటింగ్‌లో సర్దుకోవచ్చు. కానీ ఇది మ్యూజికల్ సినిమా. డైలాగ్ మారితే స్కేల్ మారిపోతుంది. మొత్తం మళ్లీ చేయాల్సి వస్తుంది. అందుకే ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ.
-ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ పాడగలిగారు. కొంతమందికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చాం. అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు.
-ఇది మ్యూజికల్ సినిమా కాబట్టి ప్రతి విషయానికి నేనే బాధ్యత వహించాల్సి వచ్చింది. 24 గంటలూ డ్యూటీలో ఉండేవాడని (నవ్వుతూ). చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. జీవితంలో ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.
సినిమా చూసుకున్నాక మీకు ఎలా అనిపించింది?
-మేమంతా నిన్ననే స్టూడియోలో కూర్చుని సినిమా చూశాం. సినిమా చూస్తున్నప్పుడు మళ్లీ సింగీతం గారి విజన్‌కి ముగ్ధులమైపోయాం. ఆయన ఆలోచనల గొప్పతనం మరోసారి అర్థమైంది.
-ఇది నాకు ఎంతో వర్క్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్. ప్రతి డైలాగ్ మ్యూజికల్‌గా ఉన్నా, అవి చాలా సహజంగా అనిపిస్తాయి. కొంతసేపటి తర్వాత మీరు పాటలు వింటున్నారనే విషయమే మర్చిపోతారు. ఆ గ్రామంలో ఒక భాగమైపోతారు.
-ఈ సినిమాలో అద్భుతమైన భావోద్వేగాలు, గూస్‌బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. స్క్రిప్ట్ స్థాయిలోనే అవి కుదిరాయి.ఈ విషయంలో సింగీతంకి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.
ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?
-ఒక విభిన్నమైన సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు ఖచ్చితంగా కలుగుతుంది. సినిమా చూసి ఇంటికి వెళ్తూ సరదాగా మాటల్ని కూడా పాటల్లా పాడుకుంటూ వెళ్తారని నమ్ముతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా 94 ఏళ్ల వయసులో కూడా ఇంత కొత్త ఆలోచనతో, ఇంత ఉత్సాహంగా సినిమా చేసిన సింగీతం గారి నుంచి ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతారు.
-ఇందులో ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి.వాటిని ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఎందుకంటే వాటిలో కథ దాగి ఉంది.
-కమల్ హాసన్ గారు స్టూడియోకు వచ్చి సినిమా చూశారు. చాలా సంతోషించారు. "ఇలాంటి సినిమాలో నేను కూడా భాగం కావాల్సింది" అన్నారు. అది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
'ఎల్లమ్మ' గురించి?
-చాలా పని పూర్తయింది. కొన్ని పాటలు చేశాను. ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కంపోజ్ చేశాను. మ్యూజిక్, నటన విషయంలో మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. దిల్ రాజు నెలకు పది రోజుల ఇవ్వమని చెప్పారు. ఆ విధానం నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం కథ గురించి ఎక్కువ చెప్పలేను. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్‌లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









