సీఎం పుష్కర స్నానం : దుర్గాఘాట్
- August 09, 2016
కృష్ణా పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానమాచరిస్తారని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. బృహస్పతి కన్యారాశిలో గురువారం రాత్రి 9.28 గంటలకు ప్రవేశిస్తాడని.. అయితే సూర్యాస్తమయం తర్వాత పుష్కర స్నానం చేయకూడదనే నియమం ఉండడంతో 12వ తేదీ సూర్యోదయ సమయంలో పుణ్య స్నానాలు ప్రారంభమవుతాయన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానాలు ప్రారంభిస్తారని, అదే సమయంలో సీఎం స్నానం చేస్తారని వెల్లడించారు. 1,120 ప్రాంతాల్లో మొత్తం 62 వేల మంది ఉద్యోగులు పుష్కరాల సేవలందిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సేవలకోసం విజయవాడలో ఏడు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







