దుబాయ్ వాటర్‌ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- June 10, 2026
యూఏఈ: దుబాయ్ వాటర్ఫ్రంట్లోని ప్రముఖ రెస్టారెంట్ '3 ఫిల్స్' సమీపంలో వేల్ షార్క్ కనిపించిందని హోటల్ మేనేజ్ మెంట్ తెలిపింది. ఈ మేరకు ఒక వేల్ షార్క్ ఫుటేజ్‌ను షేర్ చేసింది. దానికి "ఊహించని అతిథి! పోల్కా వేల్ షార్క్" అని క్యాప్షన్ పెట్టారు.
దుబాయ్ వాటర్‌ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో కనిపించిన వేల్ షార్క్, భోజనం చేస్తున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఇది ఆన్లైన్లో త్వరగా వైరల్ అయి అందరి దృష్టిని ఆకర్షించింది.
వేల్ షార్క్ లు ప్రపంచంలోనే అతిపెద్ద చేప జాతికి చెందినది. వీటిని మానవులకు హానికరమైనవిగా పరిగణించరు. . ఇవి అప్పుడప్పుడు యూఏఈ జలాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఆహారం కోసం అవి తీరానికి దగ్గరగా వస్తుంటాయి.
అయితే, ఈ ఫుటేజీని ఎప్పుడు రికార్డ్ చేశారో రెస్టారెంట్ యాజమాన్యం వెల్లడించలేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు ప్రమాదం..ఇంకా ముగ్గురి పరిస్థితి విషమం..!!
- కువైట్‌లో 8 రోజుల్లో 1,308 యాక్సిడెంట్లు..!!
- జెడ్డాలో 20 టన్నుల పాడైన ఆహారం ధ్వంసం..!!
- వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు OMR2,000 ఫైన్..!!
- AI తప్పుడు కంటెంట్ పోస్టులు..వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడులను ఖండించిన ఖతార్..!!
- సౌదీలో జూన్ 14 నుండి ఎంటర్ ప్రెన్యూర్షిప్ వీక్..!!
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాద బాధితులకు Dh1 మిలియన్ సాయం ప్రకటించిన యూఏఈ బిలియనీర్
- దుబాయ్ వాటర్‌ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!









