సాయి ధరమ్ తేజ్ హ్యాట్రిక్ మీద కన్నేశాడు..
- August 09, 2016
మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం కోసం చాలా కష్టపడుతున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. తొలి సినిమా పిల్లా నువ్వు లేని జీవితంతో మంచి సక్సెస్ సాధించిన సాయి తరువాత విడుదలైన రేయ్ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తరువాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.హారిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో 20 కోట్ల వసూళ్ల మార్క్ కు చేరువైన సాయి.. ఆ తరువాత విడుదలైన సుప్రీంతో, ఆ మార్క్ ను ఈజీగా దాటేశాడు. తాజాగా తిక్క సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న మెగా వారసుడు, ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ మీద కన్నేశాడు. అయితే సాయి తిక్కకు ఒక్క రోజు ముందే వెంకటేష్ బాబు బంగారం రిలీజ్ అవుతుండటంతో తిక్క కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి సీనియర్ హీరో ఇమేజ్ ను దాటి సాయి ధరమ్ తేజ్ రికార్డ్ అందుకుంటాడేమో చూడాలి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







