రచయిత అరుణాచలం కన్నుమూత..

- August 09, 2016 , by Maagulf
రచయిత అరుణాచలం కన్నుమూత..

 ప్రముఖ కథా రచయిత, గీత రచయిత, దర్శకుడు, నిర్మాత పంచు అరుణాచలం (75) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలో మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, ప్రభు, శివ వంటి అగ్ర కథానాయకులతో ఎక్కువ సినిమాలు చేశారు. 'అన్నాకిలీ' చిత్రంతో మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజాను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. నాలుగు దశబ్దాల సినీ జీవితంలో 'మనమగలె వా', 'పుతు పాటు', 'కళికాలం', 'తంబి పొండట్టి' వంటి సినిమాలకు దర్శకత్వం వహించగా, 'ప్రియా', 'అరిలిరుతు అరుబతు వారై', 'ఆనంద రాగం', 'జపనిల్‌ కల్యాణరామన్‌', 'గురు శిష్యన్‌', 'మైఖేల్‌ మదన కామరాజన్‌', 'రాసుకుట్టి', 'వీరా' (తెలుగు రీమేక్‌ అల్లరి మొగుడు), 'రిషి', 'పూవెల్లమ్‌ కెట్టుప్పర్‌' వంటి దాదాపు 15 సినిమాలును నిర్మించారు. అలాగే వందకిపైగా చిత్రాలకు రచయితగా పనిచేశారు. వాటిలో 'చాణక్య','అలెగ్జాండర్‌', 'మాయాబజార్‌', 'వీరా', 'పాండియన్‌', 'ధర్మదురై', 'సింగరావెలన్‌', 'రాజాధి రాజా', 'రాజా చిన్న రోజా', 'ధర్మతిన్‌ తలైవన్‌', 'మణితన్‌', 'నల్లతంబి', 'వాజకారు', 'పాయుమ్‌ పులి', 'పోకిరి రాజా', 'సకల కళ వల్లవన్‌', 'కజుగు', 'మీందుమ్‌ కోకిల', 'వర్టిక్కు ఒరువన్‌', 'కవిక్కుయిల్‌', 'అన్నాకిలి' ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథలు అందించారు. రజనీకాంత్‌కు మాస్‌ ఇమేజ్‌ తీసుకురావడంలో అరుణాచలం పాత్ర కీలకం. రజనీకాంత్‌ నటించిన 23 చిత్రాలకు, కమల్‌ హాసన్‌ నటించిన 13 చిత్రాలకు కథ అందించడంతోపాటు పలు సినిమాలు నిర్మించారు. తమిళ ఇండిస్టీకి మాస్‌ ఇమేజ్‌ను తీసుకురావడంలో రచయిత పంచు అరుణాచలం కథలు ప్రధాన భూమిక పోషించాయి. మూడు చిత్రాలకు పాటలు కూడా రాశారు. ఆయనపై ఈ ఏడాది మార్చిలో రచయిత, నిర్మాత ధనంజయన్‌ 'ఏ క్రియేటర్‌ విత్‌ మిదాస్‌ టచ్‌' అనే డాక్యుమెంటరీ రూపొందించారు. పంచు అరుణాచలం మృతిపట్ల రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, ప్రభు, తమిళ దర్శకుల సంఘం, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, ఆర్టిస్టుల అసోసియేషన్‌, రచయితల సంఘం తదితర కోలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com