ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- June 12, 2026
మస్కట్: ఒమన్ కీలకమైన సాంస్కృతిక వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలకు సవరణలు చేసింది. ఒమన్ సుల్తానేట్ తన భౌతిక మరియు అభౌతిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేసినట్లు పేర్కొంది. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు జాతీయ గుర్తింపును పటిష్టం చేయడానికి చట్టపరమైన వ్యవస్థను బలోపేతం చేసే విస్తృత ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగమని ప్రకటించింది.
యునెస్కో జాబితాలలో నమోదు చేయబడిన లేదా నామినేట్ చేయబడిన ప్రదేశాలను సూచించడానికి "ఒమన్ ప్రపంచ సాంస్కృతిక వారసత్వం" అనే కొత్త పదాన్ని రూపొందించింది. ఇది ఒమన్ అంతర్జాతీయ ఉనికిని మరియు సంబంధిత ప్రపంచ ఒప్పందాల పట్ల దాని నిబద్ధతను చాటి చెబుతుందన్నారు. భౌగోళిక వారసత్వంపై ఒక ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చారు. ఇందులో శిలా నిర్మాణాలు, శిలాస్తరాలు, నిర్మాణాత్మక మరియు భూరసాయన లక్షణాలు, శిలాజాలు, మరియు ఉల్కలు వంటి అసాధారణ శాస్త్రీయ విలువ కలిగిన విశిష్ట భౌగోళిక దృగ్విషయాలు ఉన్నాయని తెలిపింది.
గ్రహశకలాలు లేదా సౌర వ్యవస్థలోని గ్రహాల నుండి ఉద్భవించి, వివిధ పరిమాణాలలో భూమిపై పడిన ఉల్కలపై కూడా ఈ చట్టం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉల్కలను వెతకడం, స్వాధీనంలో ఉంచుకోవడం లేదా పారవేయడం కోసం స్పష్టమైన నియంత్రణలను ఏర్పాటు చేశారు. వీటి ఉల్లంఘనలకు కఠినమైన శిక్షలను విధిస్తారు. వారసత్వ వస్తువుల అక్రమ రవాణా కేసులలో, కనీసం నాలుగు సంవత్సరాల నుండి గరిష్టంగా పది సంవత్సరాల వరకు జైలు శిక్ష, కనీసం RO 20,000 నుండి గరిష్టంగా RO 150,000 వరకు జరిమానా విధించబడుతుంది. అనధికారికంగా వస్తువులను స్వాధీనంలో ఉంచుకోవడం, పారవేయడం లేదా నాశనం చేయడం వంటి వాటికి అదనపు శిక్షలు వర్తిస్తాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ప్రపంచ ఇంటెలిజెంట్ సిటీస్ జాబితాలో దోహా..!!
- ఏసీఐ వరల్డ్ లెవల్-5 అక్రెడిటేషన్ సాధించిన జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం
- హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం...
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్‌తో మరింత విస్తరించనున్న రవాణా వ్యవస్థ..
- ఆపదలో ఉన్న వేలాది మందికి అండగా GDRFA దుబాయ్..
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
- దక్షిణ ఇరాన్ పై విరుచుకపడ్డ అమెరికా వైమానిక దళం!
- ఖతార్ టాయ్ ఫెస్టివల్ 2026కు గడువు పొడిగింపు..!!
- జాబ్ కోసం ప్రభుత్వ ఉద్యోగికి లంచం.. ముగ్గురికి రెండేళ్ల జైలుశిక్ష..!!
- మచిలీపట్నం పేరుతో భారత నౌకాదళ అత్యాధునిక నౌక..ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం







