ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో దారుణం
- August 10, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో దారుణం జరిగింది. ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరగడంతో 11 మంది నెలలు నిండని పసివారు సజీవదహనమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక యార్మౌక్ ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. నెలలు నిండకుండానే పుట్టి ఆసుపత్రి ఇంక్యుబేటర్‌లో చికిత్స పొందుతున్న 11 మంది పసిబిడ్డలు ఈ ఘటనలో సజీవదహనమయ్యారు. అప్రమత్తమైన అధికారులు ఏడుగురు చిన్నారులు, 29 మంది మహిళలను రక్షించి మరో ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ సరఫరాలో లోపం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







