త్వరలో 'రజినీకాంత్' జీవితకథ ఆధారంగా సినిమా
- August 10, 2016
ముఖం ముదుసలి రూపు తీసుకుంటున్నా మునుపటి సత్తా సడలని వాడు. కండరాలు పట్టు సడలుతున్నా కంటెంట్ ఏమాత్రం తగ్గనోడు. కండక్టర్‌గా జీవితాన్ని మొదలుపెట్టి.. దేశం యావత్తూ దైవంలా కొలిచే స్థాయికి చేరుకున్నాడు. అతనే.. సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ పేరు వింటనే.. స్టైల్‌కు దిమ్మతిరుగుతుంది. అభిమానానికి పూనకం వస్తుంది. ఈ విషయాన్ని ఆరుపదుల వయసులోనూ 'కబాలి'తో నిరూపించాడు రజనీ. కొద్దిరోజుల క్రితం.. ప్రపంచం మొత్తం రజనీ మాయలో మైమరిచిపోయింది. సినీ రంగంలో తనకంటే పెద్ద స్టార్ ఎవరూ లేరని, తాను స్టార్‌లకే స్టార్ అని చెప్పకనే చెప్పాడు. ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు.. నిరాడంబరత, మనిషంటే అపార గౌరవం, కష్టంపై అభిమానం. కాబట్టే కండక్టర్‌గా జీవితం మొదలుపెట్టి అనేకరకాల పనులు చేసి మెట్టు మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగిన మొదటి మెట్టును ఏమాత్రం మరిచిపోని రజనీ.. ఇప్పటికీ సాధారణ జీవితం గడుపుతాడు. జీవితంపై ఇంతటి అపార అవగాహన ఉన్నవాడు కాబట్టే ఏ పాత్ర ఇచ్చినా తెరపై ప్రాణం పోస్తాడు రజనీ. అలాంటి రజనీ నిజజీవిత పాత్రకు ప్రాణం పోయాలనుకుంటున్నారు ఆయన కుమార్తెలు. ప్రస్తుతం భారతదేశంలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. క్రీడాకారులు నుంచి సినీనటుల వరకు పలు బయోపిక్ రావడమే కాకు సంచలన విజయాలు నమోదు చేశాయి. ఆ కోవలోనే.. రజనీ జీవితంలో అనేక రహస్యాలను ఒకచోట పేర్చుతూ ఆయన జీవితాన్ని తెరకెక్కించాలని ఆయన కుమార్తెలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కథ సిద్ధం చేయడం కోసం రజనీకి సంబంధించిన పూర్వాపరాలను సేకరించే పనిలో పడ్డారు. రజనీ పుట్టిన, పెరిగిన, పనిచేసిన ప్రాంతాలకు వెళ్ల అనేక విషయాలను రాబట్టారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానకి అంతా సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో రజనీ పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఒక నిర్ణయానికి రాలేదని కోలీవుడ్ ఫిలింవర్గాల సమాచారం. రజనీ స్టైల్, మేనరిజం మరో నటుడు పలికించలేడని, రజనీ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడని కూడా ఆలోచిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం ఈ ఏడాది ప్రారంభించి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎటువంటి అవాస్తవాలు లేకుండా, రజనీ పుట్టుక, కండక్టర్‌గా జీవితం, సినీ రంగ ప్రవేశం, సూపర్ స్టార్‌గా ఎదిగిన వైనం, సినీ వివాదాలు, కుటుంబం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుందన్నది సమాచారం. ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ చిత్రానికి రజనీ కుమార్తెలు స్వయంగా దర్శకత్వం వహించనుండడం కొసమెరుపు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







