నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం
- August 10, 2016
సివిల్ డిఫెన్స్ వర్గాలు, నిర్మాణంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు గుర్తించాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్ళి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సమీపంలోని నిఆసితులు, జైదా ఫ్లై ఓవర్ వద్ద పొగను చూసినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఉదయం 6.30 నిమిషాల సమయంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఈ వ్యవహారంపై స్పందించి, స్పష్టతనిచ్చింది. అల్ ఫహాద్ ఫుడ్ సెంటర్ సమీపంలోని సల్వా రోడ్లో నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తేల్చింది. దోహాలో నెల రోజుల వ్యవధిలో ఇది మూడో అగ్ని ప్రమాదం, అదీ నిర్మాణంలో ఉన్న భవనం అగ్ని ప్రమాదానికి గురికావడం. ఈ నెల రెండవ తేదీన అన తుమ్మా ఏరియాలో ఓ భవనం అగ్ని ప్రమాదానికి గురయ్యింది. జులైలో దహల్ అల్ హమామ్ పార్క్ సమీపంలోని తవార్ మాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







