'బింఘట్టి' ఉచిత అపార్ట్‌మెంట్ ను గెలిచిన కేరళ మహిళ..!!
- June 22, 2026
యూఏఈ: 'విన్ యువర్ హోమ్ ఇన్ దుబాయ్' (Win Your Home in Dubai) లక్కీ డ్రా ద్వారా ఉచిత బింఘట్టి అపార్ట్‌మెంట్‌ను భారతదేశంలోని కేరళకు చెందిన, దుబాయ్ నివాసి అయిన 27 ఏళ్ల అయేషా అమీర్ గెలుచుకున్నారు.దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రీటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) మరియు దుబాయ్ ఛాంబర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ డ్రాలో, దుబాయ్‌లోని ఎంపిక చేసిన దుకాణాలు మరియు అవుట్‌లెట్‌లలో కనీసం 500 దిర్హామ్‌లు (Dh500) ఖర్చు చేసిన వినియోగదారులు QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఈ పోటీలో పాల్గొనవచ్చు.
అత్యున్నత శ్రేణి రియల్ ఎస్టేట్ సంస్థ అయిన 'బింగ్‌హట్టి' దీనికి ప్రత్యేక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అదృష్ట విజేతలకు సుమారు 12 అపార్ట్‌మెంట్‌లను అందించనుంది.ఈ డ్రా ఆగస్టు 30 వరకు కొనసాగుతుంది. ఆ రోజున 12వ అపార్ట్‌మెంట్ విజేతను ప్రకటిస్తారు. వారపు డ్రాలో మొదటి విజేతగా నిలిచిన అమీర్, సాధారణంగా షాపింగ్ చేస్తున్న సమయంలో ఈ పోటీ గురించి తెలుసుకున్నారు.దుబాయ్ నివాసి అయిన ఆమెకు గత ఏడాదే వివాహం జరిగింది. ఆమె మరియు ఆమె భర్త అపార్ట్‌మెంట్ కొనాలని ఆలోచిస్తున్నప్పటికీ, ఈ ఏడాది ప్రారంభంలో ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు.
దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE)లో రిటైల్ క్యాలెండర్ మరియు ప్రమోషన్స్ విభాగానికి తాత్కాలిక వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహమ్మద్ ఫెరాస్ అరైకత్ మాట్లాడుతూ.. ఈ డ్రాలో సుమారు 1,000 బ్రాండ్లు మరియు 4,000కు పైగా అవుట్‌లెట్లు పాల్గొంటున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చ
- దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







