నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!

- June 22, 2026 , by Maagulf
నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!

మస్కట్: అల్ ఖబూరా మరియు సహమ్ ప్రాంతాల్లోని (విలాయత్‌లలోని) వాణిజ్య సంస్థల నుండి రిఫ్రిజిరేషన్ యూనిట్లను వరుసగా దొంగిలించిన ఆరోపణలపై నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ విభాగం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇద్దరు వ్యక్తులు ఆ రెండు ప్రాంతాల్లోని పలు దుకాణాల నుండి రిఫ్రిజిరేషన్ మరియు కూలింగ్ యూనిట్లను చోరీ చేశారు. ఫిర్యాదులు అందిన తర్వాత సీసీ కెమెరాల సాయంతో విచారణ చేపట్టిన పోలీసులు, ఇద్దరు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com