దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!

- June 22, 2026 , by Maagulf
దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!

దుబాయ్‌: కేరళకు చెందిన 42 ఏళ్ల భారతీయ ప్రవాసి దుబాయ్‌లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. మృతుడిని త్రిస్సూర్ జిల్లా, చిట్టిలక్కాడ్‌లోని సౌత్ పుతియతలకు చెందిన అన్వర్ సాదిక్‌గా గుర్తించారు. సాదిక్ తన కుమార్తె వివాహ నిమిత్తం ఇటీవల దుబాయ్‌కి వచ్చాడు. అతను బంధువులు, స్నేహితులతో బ్యాడ్మింటన్ ఆడుతుండగా  గుండెపోటుకు గురయ్యాడు.

ఇటీవల నవాయత్ కమ్యూనిటీలో సుప్రసిద్ధ క్రికెటర్, దుబాయ్ నివాసి అయిన 38 ఏళ్ల మహమ్మద్ సఫ్వాన్ షాను, క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుతో మరణించాడు. దుబాయ్‌లో జరిగిన అతని అంత్యక్రియలకు వందలాది మంది హాజరయ్యారు. ఈ రెండు కేసులు గుండె జబ్బులు, ఆకస్మిక గుండెపోటు, తీవ్రమైన శారీరక శ్రమతో ముడిపడి ఉన్న ఆరోగ్య ప్రమాదాలపై ఆందోళనలను పెంచాయి.
అల్ ఖుసైస్‌లోని ఆస్టర్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ అయిన డాక్టర్ షిప్రా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. గుండె జబ్బులు కేవలం వృద్ధులకే వస్తాయనేది ఒక అపోహ అని అన్నారు. యువకులలో కూడా అనేక క్లినికల్ కార్డియాక్ పరిస్థితులు ఉండవచ్చని, వ్యక్తులు పుట్టుకతోనే గుండె లోపాలు ఉండవచ్చని, అవి తరువాతి వయస్సులో బయటపడవచ్చని అన్నారు. నిర్ధారణలో బయటపడకుండా ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలలో హైపర్‌ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతీ (HOCM), గుండె విద్యుత్ ప్రసరణ వ్యవస్థలో హెచ్చుతగ్గులు మరియు కరోనరీ ఆర్టరీ వ్యాధి వంటివి ఉన్నాయని డాక్టర్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఏమాత్రం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com