గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చ

- June 22, 2026 , by Maagulf
గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చ

హైదరాబాద్: గల్ఫ్ కార్మికుల ఓటు హక్కులపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చ తెలంగాణ రాష్ట్ర 'గల్ఫ్ కాంగ్రెస్' ప్రతినిధి సుతారి సత్యనారాయణ పటేల్, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణపై చర్చించారు. విదేశాల్లో నివసిస్తున్న వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగించేందుకు చర్యలు, ఆన్‌లైన్ అవగాహన కార్యక్రమాలపై సూచనలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రతిపాదనలను సానుకూలంగా స్వీకరించి, గల్ఫ్ దేశాల్లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com