రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- June 22, 2026
సూరత్: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదిద్దామనుకున్న ఓ వ్యక్తి చివరికి అప్పుల పాలయ్యాడు. ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి సినిమా స్టైల్‌లో కిడ్నాప్ డ్రామా ఆడాడు. తనను కిడ్నాప్ చేశారంటూ నోట్లో గుడ్డలను కుక్కి.. చేతులను కట్టేసిన వీడియోను తన భార్య, కుటుంబ సభ్యులకు పంపించాడు. రూ.50లక్షలు ఇస్తేనే తనను విడుదల చేస్తారని.. వెంటనే రూ.50లక్షలు పంపించాలంటూ ఎమోషనల్ డ్రామా ఆడాడు. అయితే, భార్య చేసిన పనికి అతనికి దిమ్మతిరిగిపోయింది. ప్లాన్ మొత్తం గుట్టురట్టు కావడంతో సారు ఘనకార్యం వెలుగులోకి వచ్చింది.
అసలు విషయంలోకి వెళితే.. సూరత్ కు చెందిన 30ఏళ్ల జిగ్నేష్ అనే వ్యక్తి అకౌంటెంట్. షేర్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టి రూ.50లక్షల నుంచి రూ. 60లక్షల వరకు నష్టపోయాడు. దీంతో అప్పుల ఊబిలో చిక్కుకున్న అతడు కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు రాబట్టేందుకు కిడ్నాప్ డ్రామా ఆడాడు. ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. జిగ్నేశ్ గోద్రాలోని ఓ హోటల్ లో గదిని తీసుకున్నాడు. ఆ హోటల్ గదిలో తన చేతులు, కాళ్లు కట్టేసినట్లు.. నోట్లో గుడ్డలు కుక్కినట్లు వీడియో తీశాడు. అనంతరం తన భార్య, కుటుంబ సభ్యులకు ఆ వీడియో పంపించాడు.
జిగ్నేశ్ పంపిన వీడియోలో తనను కిడ్నాప్ చేశారు.. రూ.50లక్షల ఇస్తేనే వదిలేస్తామంటున్నారు.. వెంటనే ఆ మొత్తాన్ని పంపించాలంటూ భయపడుతూ వేడుకుంటున్నాడు. దీంతో కంగారుపడిన అతని భార్యకు ఏం చేయాలో తోచలేదు. కొద్దిసేపటికి తేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు రంగంలోకిదిగి.. సాంకేతిక ఆధారాలు, మొబైల్ లోకేషన్ ఆధారంగా జిగ్నేష్ ఉన్న హోటల్ గదిని గుర్తించారు. అందులోకి వెళ్లి చూడగా జిగ్నేష్ ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అసలు విషయంపై ఆరాతీయగా.. తనను తానే కిడ్నాప్ చేసుకున్నానని జిగ్నేష్ చెప్పాడు.
పోలీసుల ప్రాథమిక విచారణలో షేర్ మార్కెట్ నష్టాలు, అప్పుల ఒత్తిడి కారణంగానే ఈ నాటకానికి పాల్పడినట్లు జిగ్నేశ్ అంగీకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. అయితే, జిగ్నేశ్ చేతులకు, కాళ్లకు కట్టువేసి ఉంటే.. వీడియో ఎవరు తీశారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ మేరకు జిగ్నేశ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి.. సినిమా స్టైల్ లో డ్రామాకు తెరలేపిన భర్తకు.. పోలీసుల సహాయంతో భర్త డ్రామాకు భార్య తెరదించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చ
- దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







