చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- June 24, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో 11 ఏళ్ల చిన్నారి పై జరిగిన అమానుష హత్యాచారం ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన మృగాడిని పట్టుకునే క్రమంలో ఢిల్లీ పోలీసులు బుల్లెట్ రుచి చూపించారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ (ఘటనా స్థలాన్ని పునర్నిర్మించే ప్రక్రియ) కోసం నిందితుడిని పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా, ఆ సమయంలో అతడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. నిందితుడు ఎదురుతిరిగి ప్రతిఘటించడంతో, అప్రమత్తమైన పోలీసులు అతడి కాలుపై కాల్పులు జరిపి ఎన్కౌంటర్ ద్వారా చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, పోలీసుల ప్రాథమిక విచారణలో తానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు మృగాడు నేరాన్ని అంగీకరించాడని ఉన్నతాధికారులు వెల్లడించారు.
వైరల్ వీడియో..నెటిజన్ల ప్రశంసలు!
కాల్పుల అనంతరం తీవ్ర గాయమైన నిందితుడిని పోలీసులు పట్టుకుని తీసుకెళ్తుండగా, “నేను చనిపోయా.. నన్ను వదిలేయండి” అంటూ ఆ మృగాడు భయంతో ఏడుస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక పసి ప్రాణాన్ని బలితీసుకునేటప్పుడు లేని భయం, తప్పు చేసి పోలీసులకు దొరికిపోయేసరికి నిందితుడిలో కనిపించడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. చిన్నారికి అన్యాయం చేసిన వాడికి తగిన శాస్తే జరిగిందంటూ ఢిల్లీ పోలీసుల తక్షణ చర్యను, సాహసాన్ని ప్రజలు మరియు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మహిళలు, బాలికలపై ఇలాంటి ఘోరాలకు పాల్పడే వారికి ఈ ఎన్కౌంటర్ ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తుందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్‌తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్‌ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్‌లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







