'ఎమ్‌.ఎస్‌. ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ' చిత్ర ట్రైలర్‌ ఈరోజు విడుదల .

- August 11, 2016 , by Maagulf
'ఎమ్‌.ఎస్‌. ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ' చిత్ర ట్రైలర్‌ ఈరోజు విడుదల .

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఎమ్‌.ఎస్‌. ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ'. భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ జీవితాధారంగా ఈ సినిమాని దర్శకుడు నీరజ్‌ పాండే తెరకెక్కించారు. ఇందులో రీల్‌ ధోనీగా సుశాంత్‌ నటించాడు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఈరోజు విడుదల కాబోతోంది. ట్రైలర్‌ను దిల్లీలో సుశాంత్‌ సింగ్‌ చదివిన కులాచి హన్స్‌రాజ్‌ మోడల్‌ స్కూల్‌లో విడుదల చేస్తున్నారు. ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమానికి సుశాంత్‌ సింగ్‌తో పాటు ధోనీ కూడా హాజరయ్యాడు. ధోనీ రాకతో అక్కడి వాతావరణం సందడిగా మారింది.
సుశాంత్‌ తన స్కూల్‌ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. స్కూల్‌భవనం మొదటి అంతస్థులోని రెండో గదే తన క్లాస్‌రూం అంటూ సుశాంత్‌ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com