కేటీఆర్ కొలంబోలో పలువురు ప్రముఖులతో వరుస భేటీలు
- August 11, 2016
తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్విదేశీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఆయన శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో పలువురు ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహించారు. తొలుత శ్రీలంకలో భారత హై కమిషనర్ వైకే సిన్హతో సమావేశమై ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల పెంపుపై చర్చించారు. కొలంబో- హైదరాబాద్ విమాన సౌకర్యం పైనా ఆయనతో ప్రస్తావించారు. దీంతో ఆయన తెలంగాణలో శ్రీలంక పెట్టుబడులకు భారత్ కమిషనర్ హామీ ఇచ్చారు. జాన్కీల్స్ కంపెనీ ప్రతినిధులతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులకు వారు సంసిద్ధత వ్యక్తంచేశారు. మలేషియాలోని పేర్ రాష్ట్ర సీఎంతో కొలంబోలో కేటీఆర్ సమావేశమయ్యారు. పలు వ్యాపార ఒప్పందాలకు సంబంధించి ఇరువురిమధ్య చర్చలు జరిగాయి.




తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









