యుక్తవయసు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఉల్లాసంతో వృద్ధాప్యం దూరం!

- August 11, 2016 , by Maagulf
యుక్తవయసు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఉల్లాసంతో వృద్ధాప్యం దూరం!

నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే నేటి పౌరులే రేపటి పెద్దలు, వృద్ధులు! మనం విస్మరించటానికి వీల్లేని జీవన సత్యం ఇది. వయసును ఆపలేంగానీ వయసుతో పాటు మొదలయ్యే రకరకాల వ్యాధుల నుంచి.. ఆ బాధల నుంచి తప్పించుకోవటం మాత్రం చాలా వరకూ మన చేతులో ఉన్న వ్యవహారమే. చాలామంది ముసలితనంలో జబ్బులు సహజమని నమ్ముతుంటారుగానీ నిజానికి యుక్తవయసు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. మలివయసు వారిని ప్రతి నిత్యం ఇబ్బందికి గురిచేసే ముఖ్యమైన సమస్య మలబద్ధకం. తగినంత శారీరక శ్రమ లేకపోవటం, దానికి తోడు సరిగా నమల లేక పీచు పదార్థాలు-కూరగాయల వంటివి బాగా తగ్గించి, నమలాల్సిన అవసరం అంతగా లేని తేలిగ్గా తినటానికి వీలెన శుద్ధి చేసిన పదార్థాలనే ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ సమస్య మరింతగా ముదురుతుంది. కాబట్టి దీనికి పరిష్కారమేమిటో మనకు తేలిగానే అర్థమవుతోంది. పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాల వంటివి ఎక్కువగా తినాలి. నీరు సమృద్ధిగా తాగాలి. పీచులేని, బాగా శుద్ధి చేసిన పదార్థాలు తగ్గించాలి. ముఖ్యంగా ప్రతిరోజూ మలవిసర్జన జరిగితేనే హాయిగా ఉంటుందన్న భావన నుంచి బయటపడటం అవసరం. మలవిసర్జన- రోజుకు మూడు సార్ల నుంచీ వారానికి మూడు సార్ల వరకూ... సహజమే. కాబట్టి ప్రతి రోజూ విసర్జన జరగాల్సిందేనన్న భావనతో ఆలోచనలన్నీ దానిచుట్టూనే తిప్పుకోవటం అనవసరం. ఒక వయసుకు రాగానే కంటిలోని కార్నియా పొర దళసరిగా తయారై, శుక్లాలు రావటం కూడా సహజం. దీనికి ఇప్పుడు- శుక్లాన్ని తొలగించి కంటిలోనే లెన్సును అమర్చే సమర్థమైన సర్జరీ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒక వయసుకు వచ్చేసరికి వినికిడి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో అధిక పౌనఃపున్యం ఉండే ధ్వనులు సరిగా వినపడవు. చాలామంది వినికిడి తగ్గిందన్న విషయాన్ని అంగీకరించటానికే ఇష్టపడరు. ఒకవేళ దాన్ని అంగీకరించినా, వెద్యులకు చూపించుకోవటానికి ఇష్టపడరు. కానీ దీనివల్ల నలుగురిలో కలవలేకపోవటం, ఎవరేమంటారోనని చిన్నతనంగా భావిస్తుండటం, సమాజానికి దూరం కావటం, క్రమేపీ కుంగుబాటులోకి జారిపోవటం వంటి సమస్యలన్నీ బయల్దేరతాయి. కాబట్టి వినికిడి తగ్గుతోందనిపిస్తే తోసేసుకుని తిరగటం కాకుండా.. వెద్యులకు చూపించుకుని అవసరమైతే తేలికపాటి వినికిడి యంత్రాల వంటివి తీసుకోవటం ద్వారా చక్కటి సామాజిక జీవితాన్ని గడపొచ్చని గుర్తించాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకుంటే మలివయసు కూడా చక్కటి ఆరోగ్యంతో ఎంతో ఆహ్లాదంగా, హాయిగా గడచిపోతుంది. అందుకే యుక్తవయసులో చక్కటి జీవన సరళిని అలవరచుకోవటమంటే ఒక రకంగా మలివయసుకు మనం చేసే 'జీవిత బీమా' అది. అలాగే మలివయసుకు వచ్చేసరికి చాలామంది 'ఈ వయసులో వ్యాధులు సహజమే' అనుకుంటారు గానీ అది సరికాదు. నేడు మనకు అందుబాటులో ఉన్న వెద్య పరిజ్ఞానం, సదుపాయాలతో ఏ వయసులోనెనా వ్యాధులతో ఇక్కట్లు పడాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిందల్లా.. కాస్త ముందుగా మేల్కొనటం. అందుకే మలివయసులో తరచుగా పలకరించే సమస్యలేమిటో, వీటికి నేటి వెద్యరంగం అందించే వివరాలేమిటో క్లుప్తంగా చూద్దాం.మోకాళ్ల నొప్పులు: ఒక వయసుకు వచ్చే సరికి ఎంతోమందికి జీవితంలో నరకం చూపిస్తున్న పెద్ద సమస్య మోకాళ్ల నొప్పులు. దీనికి ప్రధానంగా మోకాలిలోని కీలు,ఎముకలు, వాటి మధ్య కదలికలు మృదువుగా ఉండేలా చూస్తుండే సున్నితమైన మృదులాస్థి పొరలు అరిగిపోవటం ముఖ్యకారణం. 55-60 ఏళ్ల వయసు తర్వాత దాదాపుగా సగానికి సగం మంది ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య ఇది. తీవ్రమైన మోకాళ్ల నొప్పి వల్ల నడక నరకంగా తయారై కదల్లేకపోతుంటారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి మరింత బరువు పెరగుతారు. బరువు పెరిగినకొద్దీ మోకాళ్ల నొప్పులు మరింత సతాయిస్తాయి. ఇలా ఇదో విషవలయంగా తయారవుతుంది. అందుకని పెద్దవయసులో సాధ్యమైనంత వరకూ బరువు పెరగకుండా చూసుకోవటం మంచిది.అలాగే బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలి. బరువు తగ్గితే మోకాళ్లు అరిగిపోయే ముప్పు కూడా తగ్గుతోందని 'ఫ్రేమింగ్‌హ్యామ్ ఆస్టియో ఆ్రర్త్థెటిస్' అధ్యయనంలో స్పష్టంగా గుర్తించారు. కొద్దిగా మోకాళ్ల నొప్పులున్నా కదలికలు మానెయ్యకూడదు, రోజువారీ ఓ మోస్తరు నడక, వ్యాయామాలు కొనసాగించాలి. ఇప్పుడు మోకాళ్ల నొప్పులకు మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. వెద్యులను సంప్రదిస్తే పరీక్షలు చేసి, సమస్య ఏ స్థాయిలో ఉంది, దీనికి ఏం చెయ్యొచ్చన్నది వివరిస్తారు. యుక్తవయసు నుంచీ చక్కటి వ్యాయామాలు చేస్తుండటం వల్ల చాలా వరకూ ఈ సమస్య దరిజేరకుండా చూసుకోవచ్చు. ఎప్పుడో వారాంతాల్లో ఒక్కసారిగా, విపరీతంగా వ్యాయామం చెయ్యటం కాకుండా.. రోజూ విడవకుండా, నిలకడగా నడక వంటి వ్యాయామాలు చెయ్యటం వల్ల మోకీలు చుట్టూ ఉండే కండరాలు బాగా బలపడతాయి. దానివల్ల భారం మొత్తం కీలే మొయ్యాల్సిన పరిస్థితి ఉండదు. ఫలితంగా కీలు అరుగుదలా తగ్గుతుంది. ఎక్కువగా గొంతిక్కూర్చోకుండా ఉండటం, ఎత్తు మడమ చెప్పులు (హైహీల్స్) వాడకుండా ఉండటం కూడా మోకీళ్లకు మంచిది.ఎముకలు విరగటం: యవ్వనంలో తెలియకుండా తిరిగేస్తాం కానీ ఒక వయసుకు వచ్చేసరికి ఎముక క్షీణత ఎక్కువగా ఉంటుంది. 45-50 ఏళ్లు దాటిన వారిలో ఎముకలు ఎండుపుల్లల్లా పెళుసుగా, బోలుగా తయారవ్వటమన్నది చాలా ఎక్కువ. ఈ ముప్పు స్త్రీలలో మరీ ఎక్కువ. దీనివల్ల చీటికీమాటికీ పడిపోవటం, ఏ చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోవటం చాలా తరచుగా చూస్తుంటాం. పైగా ఒకసారి విరిగితే వీరిలో అంత త్వరగా అతకవు కూడా. దీంతో మొత్తానికి కదలికలు తగ్గిపోవటం, తన పని తాను చేసుకునే పరిస్థితి కూడా లేకపోవటం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎముక సాంద్రత తగ్గటం వల్ల వెన్నుపూసలు విరిగిపోవటం కూడా వీరిలో ఎక్కువే. అసలీ ఎముక బోలు సమస్య (ఆస్టియోపొరోసిస్) వృద్ధాప్యంలో చాలా సహజమని అంతా నమ్ముతుంటారుగానీ ఇది నిజం కాదు. ముందు నుంచీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడాల్సిన అసరమే లేదు. పొగ తాగకుండా ఉండటం, క్యాల్షియం దండిగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవటంఅవసరం. మన జీవక్రియలకు తగినంత క్యాల్షియం అవసరం. మన ఆహారంలో క్యాల్షియం తగినంత లేకపోతే మన శరీరం దాన్ని ఎముకల నుంచి వెనక్కి తెచ్చుకుంటుంది. దీంతో ఎముకలు బలహీనపడతాయి. అలాగే కడుపులో బిడ్డ ఎదిగేటప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు స్త్రీ శరీరం నుంచి చాలా క్యాల్షియం బిడ్డకు వెళ్లిపోతుంది. దీంతో స్త్రీలు ఆస్టియోపొరోసిస్ బారినపడే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి క్యాల్షియం ఎక్కువగా ఉండే పాల పదార్థాలు, ఆకుకూరలు, సోయా, గోబీ, చేపల వంటివి తీసుకోవాలి. ఈ తీసుకున్న క్యాల్షియం ఎముకలకు పట్టేందుకు వ్యాయామం చెయ్యటం కూడా అవసరం. అలాగే కాస్త ఎండలో తిరిగితే విటమిన్-డి దక్కుతుంది, ఎముక బలానికి ఇదీ ముఖ్యమే. ఒక వయసు రాగానే అందరూ వెద్యులను సంప్రదించి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకుని, ఆస్టియోపొరోసిస్ ఉంటే తగు జాగ్రత్తలు, చికిత్స తీసుకోవటం అవసరం. అలాగే బాత్రూముల్లో పడిపోకుండా నేల నునుపుగా జారిపోయేలా లేకుండా చూసుకోవటం, ఇంట్లో నడిచేటప్పుడు పరిస్థితిని బట్టి నాలుగుకోళ్ల కర్ర సాయం తీసుకోవటం, తల తిప్పు, తూలు రావటం వంటి లక్షణాలు కనబడుతుంటే తక్షణం వైెద్యులకు చూపించుకుని, చికిత్స తీసుకోవటం కూడా చాలా అవసరం.జ్ఞాపకశక్తి లోపం: వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గేమాట కొంత వాస్తవమే అయినా ఇది అందరికీ రావాలనేం లేదు. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనబడే అవకాశం లేకపోలేదు. వృద్ధాప్యంలో కుంగుబాటు (డిప్రెషన్) చాలా ఎక్కువ కూడా. కాబట్టి ఇలాంటివేమైనా ఉన్నాయేమో వైద్యులకు చూపించుకోవచ్చు. ఎంత వయసు వచ్చినా శరీరాన్నీ, మెదడునూ చురుకుగా ఉంచుకోవటం అవసరం. నిత్యం వ్యాయామం చెయ్యటం ఎంత అవసరమో మెదడుకు పదును పెడుతుండటం కూడా అంతే అవసరం. ఇందుకోసం ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని, కొత్త విద్య నేర్చుకోవటానికి ప్రయత్నించటం, కొత్త పుస్త్తకాలు చదవటం, చదరంగం-పదకేళి-చిన్నచిన్న లెక్కలు చెయ్యటం వంటి పనుల్లో తలమునకలు కావటం మంచిది. సాంత్వన, ఏకాగ్రత పెంచే యోగ వంటి వాటిని ఆశ్రయించొచ్చు. ముఖ్యంగా- అల్జీమర్స్ వంటి కొన్నికొన్ని తీవ్ర సమస్యల్లో కనబడే మొదటి లక్షణం కూడా మతిమరుపే కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఇలా అనిపించినప్పుడు ఒక్కసారి వెద్యులతో చర్చించటం అవసరం.మలబద్దకం: మలివయసు వారిని ప్రతి నిత్యం ఇబ్బందికి గురిచేసే ముఖ్యమైన సమస్య మలబద్ధకం. తగినంత శారీరక శ్రమ లేకపోవటం, దానికి తోడు సరిగా నమల లేక పీచు పదార్థాలు-కూరగాయల వంటివి బాగా తగ్గించి, నమలాల్సిన అవసరం అంతగా లేని తేలిగ్గా తినటానికి వీలెన శుద్ధి చేసిన పదార్థాలనే ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ సమస్య మరింతగా ముదురుతుంది. కాబట్టి దీనికి పరిష్కారమేమిటో మనకు తేలిగానే అర్థమవుతోంది. పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాల వంటివి ఎక్కువగా తినాలి. నీరు సమృద్ధిగా తాగాలి. పీచులేని, బాగా శుద్ధి చేసిన పదార్థాలు తగ్గించాలి. ముఖ్యంగా ప్రతిరోజూ మలవిసర్జన జరిగితేనే హాయిగా ఉంటుందన్న భావన నుంచి బయటపడటం అవసరం. మలవిసర్జన- రోజుకు మూడు సార్ల నుంచీ వారానికి మూడు సార్ల వరకూ... సహజమే. కాబట్టి ప్రతి రోజూ విసర్జన జరగాల్సిందేనన్న భావనతో ఆలోచనలన్నీ దానిచు ట్టూనే తిప్పుకోవటం అనవసరం. మలబద్ధకం ఇబ్బంది పెడుతున్నప్పుడు వెద్యులను సంప్రదిస్తే- ఆహారపరమైన మార్పులతో పాటు అవసరాన్ని బట్టి సబ్జాగింజల పొట్టు వంటి సహజ మైన, నీటిలో కలుపుకొని తాగే పొడి వంటివాటినీ సిఫార్సు చేసా ్తరు, వీటితో తేలికగానే బయటపడొచ్చు.వేధించే రుగ్మతలు: మలివయసుకు వచ్చేసరికి చాలామందిలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. యుక్తవయసు నుంచీ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించటం ద్వారా వీటిని సాధ్యమైనంత వరకూ దరిజేరకుండా చూసుకోవచ్చుగానీ అన్నిసార్లూ వీటిని పూర్తిగా తప్పించుకోలేకపోవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులు, పక్షవాతం వంటి రకరకాల సమస్యలు వెంటాడతాయి. కాబట్టి తరచూ పరీక్షలు చేయించుకుంటూ, చికిత్స కొనసాగిస్తూ వీటిని కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. అలాగే మలివయసులో ఎదురయ్యే మరో పెద్ద సమస్య క్యాన్సర్. స్త్రీలలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, పురుషుల్లో ప్ర్రోస్టేటు గ్రంథి క్యాన్సర్ల వంటివి ఎక్కువ. ఊపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్ల వంటివి ఇద్దరిలోనూ కనబడుతుంటాయి. కాబట్టి ఒంట్లో ఎక్కడెనా గడ్డలు రావటం, వీడకుండా దగ్గు వేధించటం, మలవిసర్జన అలవాట్లు మారిపోవటం, రక్తం కనబడటం, బరువు తగ్గిపోవటం, పుండ్లు మానకపోవటం వంటి లక్షణాలేవెనా కనబడితే వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా వెద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. యుక్తవయసు నుంచీ పండ్లు, ఆకుకూరలు, కూరగాయల వంటి సహసిద్ధమైన ఆహారం ఎక్కువగా తీసుకోవటం, బరువు పెరగకుండా చూసుకోవటం, నిత్యం వ్యాయామం చెయ్యటం- వీటితో క్యాన్సర్‌తో సహా చాలా రుగ్మతలు, వ్యాధులు దరిజేరకుండా వృద్ధాప్యాన్ని హాయిగా ఆస్వాదించే అవకాశం ఉంటుందని గుర్తించాలి.దృష్టి, వినికిడి లోపం: వయసుతో పాటు చూపు కొద్దిగా తగ్గటం సహజం కాబట్టి 35-40 ఏళ్ల నుంచీ దృష్టి పరీక్షలు చేయించుకుని అవసరమైతే కళ్ల అద్దాలు తీసుకోవటం మంచిది. ఒక వయసుకు రాగానే కంటిలోని కార్నియా పొర దళసరిగా తయారై, శుక్లాలు రావటం కూడా సహజం. దీనికి ఇప్పుడు- శుక్లాన్ని తొలగించి కంటిలోనే లెన్సును అమర్చే సమర్థమైన సర్జరీ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒక వయసుకు వచ్చేసరికి వినికిడి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో అధిక పౌనఃపున్యం ఉండే ధ్వనులు సరిగా వినపడవు. చాలామంది వినికిడి తగ్గిందన్న విషయాన్ని అంగీకరించట ానికే ఇష్టపడరు. ఒకవేళ దాన్ని అంగీకరించినా, వెద్యులకు చూపించుకోవటా నికి ఇష్టపడరు. కానీ దీనివల్ల నలుగురిలో కలవలేకపోవటం, ఎవరేమంటారో నని చిన్నతనంగా భావిస్తుండటం, సమాజానికి దూరం కావటం, క్రమేపీ కుంగుబాటులోకి జారిపోవటం వంటి సమస్యలన్నీ బయల్దేరతాయి. కాబట్టి వినికిడి తగ్గుతోందనిపిస్తే తోసేసుకుని తిరగటం కాకుండా.. వెద్యులకు చూపించుకుని అవసరమైతే తేలికపాటి వినికిడి యంత్రాల వంటివి తీసుకోవటం ద్వారా చక్కటి సామాజిక జీవితాన్ని గడపొచ్చని గుర్తించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com