46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!

- July 01, 2026 , by Maagulf
46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!

రియాద్: సౌదీ అరేబియా ప్రైవేట్ రంగంలోని ఇంజనీరింగ్ వృత్తులలో సౌదీకరణ రేటును 30 శాతానికి పెంచింది. ఇది జూన్ 30నుండి అమల్లోకి వచ్చింది.  ఈమేరకు మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (HRSD) ప్రకటించింది. ఈ ఉత్తర్వుల పరిధిలోకి వచ్చే వృత్తులలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను నియమించుకునే సంస్థలకు వర్తిస్తుందని పేర్కొంది.

సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి వృత్తిపరమైన గుర్తింపు అవసరమైన ఆర్కిటెక్చర్, విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, మెరైన్ మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌తో సహా 46 ఇంజనీరింగ్ వృత్తులను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. హెచ్‌ఆర్‌ఎస్‌డి పర్యవేక్షక బృందాలు అన్ని సంస్థలలో నిబంధనల పాటించడాన్ని పర్యవేక్షించడం ప్రారంభించాయని, గడువు ముగిసిన తర్వాత ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన జరిమానాలు విధించబడతాయని హెచ్చరించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com