'మనసున్నోడు' తొలి సీడీని నటుడు శివాజీరాజా విడుదల

- August 11, 2016 , by Maagulf
'మనసున్నోడు' తొలి సీడీని నటుడు శివాజీరాజా విడుదల

భ రత్‌ నందన్‌, తనీషా జంటగా నటించిన చిత్రం 'మనసున్నోడు'. కేశవ్‌.ఎస్‌ దర్శకుడు. ఎం.భత్తయ్య, ఎం. జైరాజ్‌ నిర్మాతలు. రాజ్‌కిరణ్‌.ఎస్‌ స్వరకర్త. హైదరాబాద్‌లో పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని నటుడు శివాజీరాజా విడుదల చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ''ముగ్గురు కుర్రాళ్లు పట్నం వెళ్లి ఏం సాధించగలిగారనే కథని ప్రేక్షకులకి నచ్చేలా వినోదాత్మకంగా తెరకెక్కించామ''న్నారు. పాటలన్నీ యువతరానికి నచ్చేలా తీర్చిదిద్దామన్నారు సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్‌. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్‌, సాయివెంకట్‌, డి.బి. సురేష్‌బాబు, కె.చిన్నమల్లయ్య, సాంబిరెడ్డి, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com