సంక్షోభం అనంతరం 25 మంది కార్మికులు జెద్దాహ్ నుంచి ఇంటికి

- August 12, 2016 , by Maagulf
సంక్షోభం అనంతరం 25 మంది కార్మికులు జెద్దాహ్ నుంచి ఇంటికి

వారి "గల్ఫ్ కల" చెరిగిపోయింది....  సంక్షోభం అనంతరం ఒక అనిశ్చిత భవిష్యత్తుని ఎదుర్కొంటున్న 25 మంది భారత కార్మికుల మొదటి బృందం ఇక్కడ నుంచి గురువారం  ఉదయం   కింగ్ అబ్దుల్ అజిజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. వీరిని భారతీయ కన్సలేట్ బస్సులో విమానాశ్రయానికి తెచ్చారు కార్మికులకు, కాన్సుల్ జనరల్ నూర్ రెహమాన్ షేక్, మరియు సీనియర్ అధికారులు ఆనంద్ కుమార్, ఎం ఫాహ్మి వీడ్కోలు తెలిపారు. సౌదీ ఓగెరు  నిర్మాణ సంస్థ ఆర్థిక మాంద్యం కారణంగా జీతాలు మరియు బకాయిలు చెల్లించనందుకు 7,700 మంది కార్మికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరినందరిని 20 శిబిరాల్లో ఉంచి ఆహారం మరియు ఆశ్రయం  ఇవ్వాల్సివచ్చింది. ఈ పరిస్థుతులలో  25 మంది కార్మికులు తమ స్వదేశానికి వెళ్లిపోవడానికి నిశ్చించుకొన్నారు వారి సంక్షోభం స్వయంగా తెల్లసుకొనేందుకు  విదేశాంగ వి.కె. సహాయమంత్రిని  భారత ప్రభుత్వం పంపడంతో ఆయన ఈ సమస్యని దాదాపుగా పరిష్కరించారు.భారత కార్మికులు ఎదుర్కొంటున్న ఈ  సంక్షోభంను సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ సైతం ఎంతో కృషి చేశారు వారి సమస్యలు పరిష్కరించడానికి తగిన  ఎన్నో మార్గ నిర్దేశకాలను జారీ చేశారు.మరియు కార్మికుల సమస్యలు మరియు వారి బాధలని  పరిష్కరించేందుకు  100 మిలియన్ సౌదీ రియాల్  ( 26 మిలియన్ డాలర్ల ) విడుదల చేశారు. కింగ్ సల్మాన్ కూడా నిష్క్రమణ వీసాలు మరియు ఆపదల్లో కార్మికులకు ఇతర విధానాలు సులభతరం సౌదీ పాస్పోర్ట్ అధికారులను ఆదేశించారు.గురువారం ఉదయం విమానాశ్రయం వద్ద పలువురు కార్మికులు తిరిగి స్నేహితులు మరియు బంధువులు కోసం  జమ్ జమ్ పవిత్ర జలాల సీసాల్లో మోస్తున్న దృశ్యం కనిపించింది. సౌదీ కార్మిక శాఖ ఇంటికి తిరిగి వెళ్లేందుకు కార్మికులకు ఉచిత ప్రయాణంని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com