సౌదీలో ప్రమాదం.. జోగాపూర్‌వాసి మృతి
- August 12, 2016
చందుర్తి: ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వలసవెళ్లిన కరీంనగర్ జిల్లావాసి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. చందుర్తి మండలంలోని జోగాపూర్ అనుబంధ గ్రామం గుడిపేటకు చెందిన గరిడే శంకర్(47) రూ.2 లక్షల వరకు అప్పుచేసి ఉపాధి కోసం సౌదీ అరేబి యాకు వెళ్లాడు. గత శుక్రవారం పని నిమిత్తం బయటికెళ్లిన శంకర్‌ను, కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన ఎన్నారైలు చికిత్స కోసం శంకర్‌ను దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి ఆరు రోజులుగా చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం శంకర్ మృతిచెందినట్లు సమాచారం అందింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







