మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- July 06, 2026
మస్కట్: ఒమాన్‌లోని ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ మాల్ ఆఫ్ మస్కట్ లో అత్యాధునిక మల్టీప్లెక్స్ ‘సెంచరీ సినిమాస్’ ప్రారంభమైంది. మొత్తం 14 స్క్రీన్లు, 1,100 మందికి పైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ మల్టీప్లెక్స్‌లో ప్రధాన ఆకర్షణగా ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యాధునిక లేజర్ ప్రొజెక్టర్‌తో పాటు డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
ఇందులో హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో పాటు భారతీయ తెలుగు సహా రీజినల్ భాషల సినిమాలు, అరబిక్ సినిమాలను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఫార్స్ ఫిల్మ్ చైర్మన్ అహ్మద్ గోల్చిన్ తెలిపారు. అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ సౌకర్యాలు, విభిన్న భాషల చిత్రాలతో ప్రతి సినీ ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు.
తాజా వార్తలు
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్







