యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- July 06, 2026
అబుదాబి: కస్టమర్ ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE).. యూఏఈలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ విదేశీ బ్యాంకు శాఖపై Dh1.82 మిలియన్ల జరిమానా విధించింది. అయితే జరిమానా విధించిన బ్యాంకు పేరును సెంట్రల్ బ్యాంక్ వెల్లడించలేదు.
సెంట్రల్ బ్యాంక్ నిర్వహించిన తనిఖీల్లో, సంబంధిత బ్యాంకు శాఖ కస్టమర్‌కు ఇవ్వాల్సిన లయబిలిటీ లెటర్‌ను నిర్దేశించిన ఏడు రోజుల గడువులో జారీ చేయలేదని గుర్తించారు. దీంతో బ్యాంక్ మార్కెట్ కండక్ట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ అండ్ స్టాండర్డ్స్‌ను ఉల్లంఘించినట్లు తేలిందని ప్రకటించారు.
సాధారణంగా కస్టమర్ తన రుణాలను మరో ఆర్థిక సంస్థకు బదిలీ చేసుకోవాలన్నా, లేదా కొత్త ఆర్థిక సంస్థ నుంచి రుణం పొందాలన్నా లయబిలిటీ లెటర్ అవసరం అవుతుంది. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు బ్యాంకులు నిర్దిష్ట గడువులోపు ఈ లెటర్ ను జారీ చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన బ్యాంకు శాఖపై జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. యూఏఈ చట్టాలు, సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన నిబంధనలు, ప్రమాణాలను బ్యాంకులు, వాటి యాజమాన్యాలు, ఉద్యోగులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ రంగంలో నిబంధనల అమలును మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







