674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- August 26, 2026
దోహా: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘాల్) దేశవ్యాప్తంగా 674 పాఠశాలల పరిసరాల్లో ట్రాఫిక్ భద్రతా చర్యలను పూర్తి చేసింది. అష్ఘాల్ చేపట్టిన స్కూల్ జోన్ ట్రాఫిక్ సేఫ్టీ ప్రోగ్రామ్ 2013 నుంచి కొనసాగుతోంది. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 675 పాఠశాలలను పరిసర ప్రాంతాలతో సహా పరిశీలించి, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచినట్లు రోడ్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం రోడ్ సేఫ్టీ ఇంజనీర్ ఇంజినీర్ అబ్దుల్లా అల్ మరాఘీ తెలిపారు.
పాఠశాలల పరిసరాల్లో గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 30 కిలోమీటర్లుగా నిర్ణయించారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ హంప్స్ ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు మార్కింగ్స్, పాదచారుల క్రాసింగ్‌లు, రెడ్ రోడ్ సర్ఫేసింగ్‌ను పునరుద్ధరించారు. సైక్లిస్టులు స్కూల్ జోన్‌కు చేరుకునే సమయంలో ముందస్తు హెచ్చరికలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల భద్రత కోసం ఫుట్‌పాత్‌లను విస్తరించడంతో పాటు రక్షణ బారియర్లు, దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక ర్యాంపులను కూడా ఏర్పాటు చేశారు.
పాఠశాలలకు విద్యార్థుల రాకపోకలు, తిరుగు ప్రయాణ సమయాల్లో వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అష్ఘాల్ సూచించింది. నిర్ణీత వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, స్కూల్ జోన్లకు చేరుకునే సమయంలో వాహనాల వేగాన్ని తగ్గించాలని కోరింది. అదేవిధంగా సైక్లిస్టులు నిర్దేశిత ప్రాంతాల్లోనే సైకిళ్లను పార్క్ చేయాలని, పాదచారులకు పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలని, పాదచారుల క్రాసింగ్ వద్ద పూర్తిగా ఆగాలని, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బందికి సురక్షిత దూరం పాటించాలని అష్ఘాల్ సూచించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







