లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్‌పై చర్యలు..!!
- July 11, 2026
రియాద్: చెల్లుబాటు అయ్యే వృత్తిపరమైన లైసెన్స్ లేకుండా అకౌంటింగ్, ఆడిటింగ్ సేవలు అందించిన మాజీ చార్టర్డ్ అకౌంటెంట్‌తో పాటు రెండు వాణిజ్య సంస్థలపై సౌదీ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగించినట్లు సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ చార్టర్డ్ అండ్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ (SOCPA) వెల్లడించింది.
SOCPA వివరాల ప్రకారం.. లైసెన్స్ రద్దు అయినప్పటికీ ఓ మాజీ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ ఆర్థిక నివేదికలకు ఆడిట్ రిపోర్టు జారీ చేసినట్లు గుర్తించారు. ఇది చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని పేర్కొంది. అలాగే, రెండు వాణిజ్య సంస్థలు అవసరమైన ప్రొఫెషనల్ లైసెన్స్ లేకుండానే తమ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా అకౌంటింగ్, ఆడిటింగ్ సేవలను ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ చర్యలు అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ ప్రొఫెషన్ చట్టంలోని ఆర్టికల్–10ను ఉల్లంఘించినవేనని SOCPA తెలిపింది. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా లేదా రద్దు/సస్పెండ్ అయిన లైసెన్స్‌తో వృత్తిని నిర్వహిస్తున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించడం ఈ చట్టం ప్రకారం నేరమని స్పష్టం చేసింది.
అకౌంటింగ్, ఆడిటింగ్ సేవలు అందించే లేదా ప్రచారం చేసే ముందు తప్పనిసరిగా చట్టబద్ధమైన అనుమతులు పొందాలని SOCPA సూచించింది. అలాగే సేవలు పొందే ముందు సంబంధిత వ్యక్తి లేదా సంస్థకు లైసెన్స్ ఉందో లేదో తమ అధికారిక వెబ్‌సైట్‌లోని జాబితా ద్వారా ధ్రువీకరించుకోవాలని, అనుమతి లేని కార్యకలాపాలు లేదా తప్పుడు ప్రకటనలు కనిపిస్తే అధికారిక ఫిర్యాదు మార్గాల ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్‌పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







