షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- July 11, 2026
షార్జా: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు షార్జా ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ గ్యాస్ అథారిటీ (SEWA) పలు కీలక రాయితీలను ప్రకటించింది. యుటిలిటీ బిల్లుల చెల్లింపుకు అదనపు గడువు, విడతల వారీ చెల్లింపు సౌకర్యం, పలు ఫీజుల మినహాయింపు వంటి చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది. పర్యాటక రంగంలో స్థిరత్వం, పోటీతత్వాన్ని పెంచడంతో పాటు పెట్టుబడిదారులకు మరింత అనుకూల వాతావరణం కల్పించడమే ఈ నిర్ణయాల లక్ష్యమని అధికారులు తెలిపారు.
ప్రధాన రాయితీలు ఇవే..
* యుటిలిటీ (Electricity, Water and Gas) బిల్లుల చెల్లింపుకు ఒక నెల అదనపు గడువు.
* వినియోగ బిల్లులను విడతల వారీగా చెల్లించే అవకాశం.
* సేవల నిలిపివేత (Disconnection)పై విధించే జరిమానాలకు మూడు నెలల పాటు మినహాయింపు.
* కొత్త యుటిలిటీ కనెక్షన్ల కోసం చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్‌ను నాలుగు విడతల్లో చెల్లించే సౌకర్యం.
* పర్యాటక సంస్థలకు ప్లాన్ ఆమోద ఫీజుపై మూడు నెలల పాటు మినహాయింపు.
* కొత్త ప్రాజెక్టులకు యుటిలిటీ కనెక్షన్ల గడువును అదనపు ఛార్జీలు లేకుండా పొడిగింపు.
* హోటళ్లు, పర్యాటక కేంద్రాల్లో ఉపయోగంలో లేని మీటర్లపై సేవా రుసుముల నిలిపివేత.
* ఖాళీగా ఉన్న సర్వీస్డ్ అపార్ట్మెంట్ యూనిట్లకు యుటిలిటీ సేవలను నిలిపివేసే అవకాశం.
* విద్యుత్ మెయింటెనెన్స్ పర్మిట్ ఫీజులను కూడా విడతల వారీగా చెల్లించే వెసులుబాటు.
* బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లించే వారికి మూడు నెలల పాటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఛార్జీలను SEWA భరిస్తుంది.
SEWA కస్టమర్ సర్వీసెస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ హుస్సేన్ అస్కర్ మాట్లాడుతూ..ఈ చర్యలు పర్యాటక రంగానికి ఊతమివ్వడంతో పాటు సేవల్లో మరింత సౌలభ్యం కల్పించి, పర్యాటక పెట్టుబడులకు షార్జాను మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్‌పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!







