అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- July 11, 2026
మనామా: బహ్రెయిన్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాల నివారణకు జస్రా ప్రాంతంలోని అల్ మజారె స్ట్రీట్ (Al Mazare' Street) విస్తరణ ప్రణాళికను పరిశీలించాలని ప్రజా పనుల మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలపై మంత్రివర్గ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, సేవల పనితీరు సూచీలను ఈ సందర్భంగా కమిటీ సమీక్షించింది.
నార్తర్న్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడు మొహమ్మద్ సాద్ అల్ దోసెరి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బహ్రెయిన్ రోడ్డు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు.
అల్ మజారె స్ట్రీట్‌లో తరచూ ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు గతంలో ఆందోళన వ్యక్తం చేశారని, అందుకే ఈ రహదారిని రెండు లేన్లుగా విస్తరించాలని డిమాండ్ చేశారని తెలిపారు.
ప్రతిపాదిత విస్తరణతో ట్రాఫిక్ రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రద్దీ తగ్గి, వాహనదారుల భద్రత మెరుగుపడుతుందని, ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జస్రా ప్రాంతానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అల్ దోసెరి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







