సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- July 11, 2026
మస్కట్: ఒమన్లోని ధోఫార్ గవర్నరేట్లో సలాలా విలాయత్ తీరానికి సమీపంలో సముద్రంలో పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో పడవలో చిక్కుకున్న ఓ ఒమాని పౌరుడిని కోస్ట్ గార్డ్ పోలీసులు సురక్షితంగా రక్షించారు.
ఎత్తైన అలలు, సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పడవ మునిగిపోయిందని రాయల్ ఒమాన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. రక్షించిన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించగా, ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాదకర డ్రిఫ్టింగ్.. జీసీసీ నేషనల్ అరెస్ట్
సలాలా విలాయత్లో వాహనంతో ప్రమాదకర విన్యాసాలు (డ్రిఫ్టింగ్) చేసిన జీసీసీ దేశానికి చెందిన ఓ వ్యక్తిని ధోఫార్ గవర్నరేట్ పోలీసు కమాండ్ అరెస్ట్ చేసింది. అతని నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా తనతో పాటు ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







