ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- July 11, 2026
జెడ్డా: ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలపై అమెరికా–సౌదీ అరేబియా చర్చలు జరిపాయి. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలిఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా–అమెరికా మధ్య ఉన్న వ్యూహాత్మక సహకారాన్ని సమీక్షించడంతో పాటు వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
అలాగే, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తాజా పరిణామాలను సమీక్షించారు. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలు, ప్రాంతీయ పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించారు. సముద్ర భద్రతను పరిరక్షించడం, అంతర్జాతీయ నౌకాయాన మార్గాల భద్రతను పెంపొందించడం అత్యంత కీలకమని ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు. మిడిలీస్టులో శాంతి, భద్రతను ప్రోత్సహించే అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు కొనసాగుతుందని వారు స్పష్టం చేశారని అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







