షారూఖ్ ఖాన్ వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సిందని శివసేన
- August 13, 2016
అమెరికాలో చేదు అనుభవం ఎదుర్కొన్న బాలీవుడు అగ్ర కథానాయకుడు షారూఖ్ ఖాన్ వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సిందని శివసేన పేర్కొంది. దేశభక్తిని చూపించి స్వదేశానికి తిరిగి వచ్చుంటే అమెరికాను చెంపదెబ్బ కొట్టినట్టుగా ఉండేదని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో శివసేన అభిప్రాయపడింది. ఏడేళ్లలో షారూఖ్ ఖాన్ ను అమెరికా విమానాశ్రయాల్లో మూడుసార్లు నిర్బంధించారని తెలిపింది. లాస్ ఏంజెలెజ్ ఎయిర్ పోర్టులో షారూఖ్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.దీనిపై శివసేన స్పందిస్తూ... అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో షారూఖ్ ను నిర్బంధించడం సాధారణ విషయంగా మారిందని, అవమానాలు ఎదురవుతున్నా అగ్రదేశానికి వెళ్లడం ఆయన మానలేదని ఆక్షేపించింది. 'ఈవిధంగా నన్ను అవమానిస్తే ఇక మీ దేశంలో అడుగు పెట్టను' అని షారూఖ్ స్వదేశానికి తిరిగి వచ్చేసివుంటే అమెరికా ముఖంపై చెంపదెబ్బ కొట్టినట్టుగా ఉండేదని శివసేన పేర్కొంది. ప్రతి ముస్లింను తీవ్రవాదిగా అమెరికా భావిస్తోందని విమర్శించింది. కశ్మీర్ యువత పెడదోవ పట్టకుండా దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని షారూఖ్ ఖాన్ కు శివసేన సూచించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







