"ఎయిర్ సెల్ కా ఆజాదీ ఆఫర్"
- August 12, 2016
70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. "ఎయిర్ సెల్ కా ఆజాదీ ఆఫర్" పేరుతో అపరిమిత లోకల్ కాల్స్ ను, డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు శుక్రవారం వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ ను వినియోగించుకోవడానికి కస్టమర్లు 123 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఎక్స్ క్లూజివ్ డీల్ కేవలం ఒక్క రోజు మాత్రమే(ఆగస్టు 15) అందుబాటులో ఉండనుంది. 123 రూపాయల రీచార్జ్ తో కస్టమర్లు అపరిమిత డౌన్ లోడింగ్, లైవ్ వీడియో స్ట్రీమింగ్, బ్రౌజింగ్ హెచ్ డీ కంటెంట్, గేమింగ్, అన్ లిమిటెడ్ టాకింగ్ సౌకర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చని ఎయిర్ సెల్ తెలిపింది."ఆజాదీ ఆఫర్"తో వినియోగదారులకు ధరల భారాన్ని తగ్గించనున్నట్టు ఎయిర్ సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరల భారాన్ని తగ్గిస్తూ.. అపరిమితమైన సదుపాయాలను వినియోగదారుల ముందు ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ స్పెషల్ ప్రొడక్ట్ ఆఫర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మొబైల్ బిల్లుల నుంచి కస్టమర్లకు పూర్తి స్వాతంత్య్రాన్ని కల్పిస్తుందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఎయిర్ సెల్ కస్టమర్ల ముందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఇటీవలే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) కూడా తన కస్టమర్లకు ఆగస్టు 15న అన్ని మొబైల్స్ కు, ల్యాండ్ లైన్ కు అపరిమిత ఉచిత కాల్స్ ను అందించనున్నట్టు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. .
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







