ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!

- July 13, 2026 , by Maagulf
ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!

జెడ్డా: ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల సౌదీ అరేబియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా పాలకుడు (కస్టోడియన్ ఆఫ్ ది టూ హోలీ మాస్క్స్) కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్.. ప్రస్తుత ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి విడివిడిగా పంపిన సందేశాలలో తమ గాఢ సెంాపాన్ని తెలియజేశారు.

షేక్ హమద్ మరణవార్త తనను తీవ్ర వేదనకు గురిచేసిందని కింగ్ సల్మాన్ తన సందేశంలో పేర్కొన్నారు. మాజీ అమీర్ తన దేశానికి, ప్రజలకు ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. ఖతార్ అమీర్ షేక్ తమీమ్‌కు, అల్ థానీ రాజకుటుంబానికి మరియు ఖతార్ ప్రజలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు.  

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కూడా ఖతార్ మాజీ పాలకుడి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఖతార్ దేశ ప్రగతిలో షేక్ హమద్ అత్యంత ప్రముఖమైన పాత్ర పోషించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఖతార్ అమీర్ షేక్ తమీమ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com