హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!

- July 13, 2026 , by Maagulf
హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!

రియాద్: హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రత, ప్రాంతీయ ఉద్రిక్తతలు, తాజా పరిణామాలపై సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఖతార్.. ఒమాన్, బహ్రెయిన్, జోర్డాన్ విదేశాంగ మంత్రులతో విడివిడిగా ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీ, ఒమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైదీ, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, జోర్డాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి అయ్మన్ సఫాదీతో ఆయన మాట్లాడారు.

మిడిలీస్టులో నెలకొన్న తాజా పరిస్థితులను సమీక్షించిన మంత్రులు..  ప్రాంతీయ దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే లేదా ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి ముప్పు కలిగించే ఎలాంటి చర్యలనైనా తిరస్కరిస్తామని స్పష్టం చేశారు.

అలాగే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడం, భద్రతను పునరుద్ధరించడం, హోర్ముజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం కోసం చేపడుతున్న చర్యలపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com